కరోనా వైరస్ ( Corona virus ) సోకి మరో ఉత్తరప్రదేశ్ మంత్రి ( up minister )..మాజీ క్రికెటరైన చేతన్ చౌహాన్ మృతి చెందారు. కరోనా వైరస్ తో పాటు ఆరోగ్యకరమైన ఇతర సమస్యలుండటంతో పరిస్థితి విషమించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మంత్రిగా పనిచేస్తున్న చేతన్ చౌహాన్ ( Chetan Chauhan ) కు జూలై నెలలో కరోనా సోకినట్టు తేలింది. తొలుత లక్నోలోని పీజీఐ ఆసుపత్రిలో చేరిన ఆయనను అనంతరం గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. శనివారం నాడు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకు తరలించారు. శరీరంలోని అవయవాలు విఫలమవడంతో ఆదివారం నాడు ఆయన కన్నుమూశారు.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ మంత్రిగా ఉన్న చేతన్ చౌహాన్ ..గతంలో భారతజట్టు తరపున ఆడారు. సునీల్ గవాస్కర్ తో కలిసి ఓపెనింగ్ చేసేవారు. 7 అంతర్జాతీయ వన్డేలు, 40 టెస్టుల్ని ఆడారు. తన క్రికెట్ కెరీర్ లో 2 వేల 84 పరుగులు సాధించగా..అందులో 16 హాఫ్ సెంచరీలున్నాయి. Also read: Parlament: వర్షాకాల సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు
Chetan Chauhan: కరోనాతో యూపీ మంత్రి, మాజీ క్రికెటర్ మృతి