Union Minister Shripad Naik: ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి గాయాలు.. భార్య, పీఏ మృతి

Union Minister Shripad Naik injured in accident | కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ గాయపడగా, ఆయన భార్య, సమీప అనుచరుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీపాద్ నాయక్ భార్య విజయ నాయక్, పీఏ దీపక్‌ను ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ వాళ్లు తుదిశ్వాస విడిచినట్టు పోలీసులు నిర్ధారించారు.

Last Updated : Jan 11, 2021, 11:38 PM IST
Union Minister Shripad Naik: ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి గాయాలు.. భార్య, పీఏ మృతి

Union Minister Shripad Naik injured in accident | న్యూ ఢిల్లీ: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ గాయపడగా, ఆయన భార్య, సమీప అనుచరుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీపాద్ నాయక్ భార్య విజయ నాయక్, పీఏ దీపక్‌ను ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ వాళ్లు తుదిశ్వాస విడిచినట్టు పోలీసులు నిర్ధారించారు. కేంద్ర ఆయుష్ (స్వతంత్ర), రక్షణ శాఖ సహాయ మంత్రి అయిన శ్రీపాద్ నాయక్ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన గోవాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రి యెల్లాపూర్ నుంచి రాష్ట్రంలోని గోకర్ణకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదానికి గురైన కేంద్ర మంత్రి కారు పూర్తిగా ద్వంసమైంది. ప్రమాద స్థలంలో దృశ్యాలను పరిశీలిస్తే.. ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం గోవాలోని ఆస్పత్రిలో కోలుకుంటున్న కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్‌కి అన్ని వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో ఫోన్‌లో మాట్లాడారు. శ్రీపాద్ నాయక్ ఉత్తర గోవా నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Also read : New Budget: 74 ఏళ్ల తరువాత ఈ తరహా బడ్జెట్ తొలిసారి..

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ( Defence Minister Rajnath Singh ) కూడా గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో మాట్లాడారు. కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్‌కి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు, ఇంకా అవసరమైతే శ్రీపాద్ నాయక్‌ను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తరలించాల్సిందిగా సూచించారు. కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ ( Union Minister Shripad Naik ) పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ( Goa CM Pramod Sawant ) ఆస్పత్రికి చేరుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News