న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ( Union minister Nitin Gadkari ) కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. నిన్న మంగళవారం తనకు కొంత అలసటగా, బలహీనంగా అనిపించడంతో డాక్టర్ని కలిసి కొవిడ్-19 టెస్ట్ ( COVID-19 ) చేయించుకోగా తనకు పాజిటివ్ అని తేలిందని నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన నితిన్ గడ్కరీ.. '' మీ అందరి ఆశీర్వాదంతో తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. తాను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను'' అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఇటీవల తనతో కాంటాక్టులోకి వచ్చిన వాళ్లు కూడా ప్రోటోకాల్ అనుసరిస్తూ సురక్షితంగా ఉండాల్సిందిగా గడ్కరి విజ్ఞప్తి చేశారు. Also read : MP Balli Durgaprasad Rao's death: గుండెపోటుతో వైసిపి ఎంపీ మృతి
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలోనే పలువురు ఎంపీలు కరోనా బారిన పడి సమావేశాలకు దూరమయ్యారు. ఆ జాబితాలో తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా చేరారు. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ( Union home minister Amit Shah ) ఏడుగురు కేంద్ర మంత్రులు, దాదాపు 20 మందికి పైగా పార్లమెంట్ సభ్యులకు కరోనావైరస్ ( Coronavirus positive ) సోకిన సంగతి తెలిసిందే. Also read : Babri Masjid demolition case: 30న బాబ్రీ కేసు తీర్పు
మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం..
- Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు
- Jackfruit benefits: పనస పండుతో ప్రయోజనాలు.. మాంసాహారానికి మంచి ప్రత్యామ్నాయం
- Russian vaccine: ఇండియన్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ తో భారీ ఒప్పందం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR