కేంద్ర బడ్జెట్ 2018 : తెలంగాణ ఏం కోరుకుంది ? ఏం దక్కింది ?

తెలంగాణ కోరుకుంది ఏంటి ? దక్కింది ఏంటి ?

Last Updated : Feb 1, 2018, 11:12 PM IST
కేంద్ర బడ్జెట్ 2018 : తెలంగాణ ఏం కోరుకుంది ? ఏం దక్కింది ?

తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్న డిమాండ్స్ :

* మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు 
* కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టుకి నిధులు కేటాయించాలనే డిమాండ్‌తోపాటు పొరుగునే వున్న ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు మాదిరిగానే జాతీయ ప్రాజెక్టు కింద గుర్తించాలనే డిమాండ్.
* తెలంగాణలో ఒక ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోన్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌లోనైనా తెలంగాణకు ఎయిమ్స్ చోటు దక్కుతుందా అనే ఆశ.
* రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారమే తెలంగాణకు ఒక్కో హార్టికల్చరల్ యూనివర్శిటీ, ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు.
* బయ్యారం స్టీల్ ప్లాంటుకి నిధుల కేటాయింపు

తెలంగాణ రాష్ట్రానికి దక్కినవి : 
* తెలంగాణకు ఎయిమ్స్ దక్కలేదు. ఈసారి గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఒక్కో ఎయిమ్స్ సంస్థను కేటాయించినట్టు కేంద్రం స్పష్టంచేసింది.
* ట్రైబల్ యూనివర్శిటీ కోసం రూ.10 కోట్లు కేటాయింపు.
* హైదరాబాద్ లో ఐఐటీ కోసం రూ.75 కోట్లు
* యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) సహకారంతో మంజూరైన ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఆపరేషనల్ ఓషనోగ్రఫీ ఏర్పాటుకి ఆమోదం.
* సింగరేణికి రూ. 2 వేల కోట్లు
* పరిశ్రమలకు వడ్డీ రాయితీ కోసం తెలంగాణకు రూ. 50 కోట్లు
* నల్లగొండ – లింగంగుంట మార్గంలో 129 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ
* పెద్దపల్లి – లింగంపేట మార్గంలో 83 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ.

ఏదేమైనా తాము కోరుకున్న విధంగా కేంద్ర బడ్జెట్ లేదని, తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణకు చెందిన వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తంచేశారు. 

Trending News