యూనియన్ బడ్జెట్ 2018 : ధరలు పెరిగేవి ఏవి ? తగ్గేవి ఏవి ?

ఏయే వస్తు, సేవల ధరల్లో పెరుగుదల చోటుచేసుకోనుంది ? ఏయే వస్తు, సేవల ధరలు అందుబాటులోకి రానున్నాయి ?

Last Updated : Feb 2, 2018, 12:08 PM IST
యూనియన్ బడ్జెట్ 2018 : ధరలు పెరిగేవి ఏవి ? తగ్గేవి ఏవి ?

2018-19 సంవత్సరానికిగాను కేంద్రం ఈరోజు ప్రకటించిన యూనియన్ బడ్జెట్ పలు వస్తు, సేవలను సామాన్యుడికి అందుబాటులోకి తీసుకొస్తే, ఇంకొన్నింటి ధరలకి రెక్కలొచ్చేలా చేసింది. మరి ఏయే వస్తు, సేవల ధరల్లో పెరుగుదల చోటుచేసుకోనుంది ? ఏయే వస్తు, సేవల ధరలు అందుబాటులోకి రానున్నాయో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ధరలు పెరిగేవి :
* మొబైల్ ఫోన్స్ ( Mobile phones )
* పర్‌ఫ్యూమ్స్ అండ్ డియోడరంట్స్ ( Perfumes and deodrants )
* కార్లు ( Cars )
* ప్యాకేజ్‌డ్ ఫ్రూట్ జ్యూస్ ( Packaged fruit juices )
* వెండి ( Silver )
* బంగారం ( Gold ) 
* డెంటల్ ఫిక్చర్స్ ( Dental fixtures ) 
* భారీ వాహనాల రేడియల్ టైర్స్ ( Radial tyres for heavy vehicles )
* పట్టు వస్త్రాలు ( Silk Fabrics ) 
* సన్ గ్లాసెస్ ( Sun glasses ) 
* మోటార్ సైకిల్స్ ( Motorcycles ) 
* ఫుట్‌వేర్ ( Footwear ) 
* రంగురాళ్లు ( Coloured gemstones )
* వజ్రాలు ( Diamonds ) 
* ఇమిటేషన్ జువెలరీ ( Imitation jewellery ) 
* స్మార్ట్ వాచీలు / ధరించే పరికరాలు ( Smart watches/wearable devices )
* ఎల్సీడీ / ఎల్ఈడీ టీవీ ప్యానెల్స్ LCD/ LED TV panels 
* ఫర్నిచర్ ( Furniture ) 
* మ్యాట్రెసెస్ ( Mattresses )
* ల్యాంప్స్ ( Lamps )
* చేతి గడియారాలు ( Wrist watches ) 
* ఆట బొమ్మలు ( Toys ) 
* వీడియో గేమ్ పరికరాలు ( Video game consoles ) 
* స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ ( Sports equipment )
* పొగాకు ఉత్పత్తులు, లైటర్స్, క్యాండిల్స్ ( Cigarette and other lighters, candles )
* గాలిపటాలు ( Kites ) 
* ఎడిబుల్ / వెజిటెబుల్ ఆయిల్స్ ( Edible/vegetable oils )

ధరలు తగ్గేవి :
* వినికిడి సామర్థ్యం పెంచే పరికరాల దిగుమతి ( Imported Hearing aids )
* ముడి జీడిపప్పు ( Raw cashew nuts )
* సోలార్ టెంపర్డ్ గ్లాస్ ( Solar tempered glass )
* ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే బాల్ స్క్రూలు ( Imported Ball screws used in electronics )

Trending News