కేంద్ర బడ్జెట్ 2018 వెనుకున్న ఆర్థిక నిపుణుడి గురించి నాలుగు ముక్కల్లో..

కేంద్రం బడ్జెట్ 2018 : ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ గురించి పలు ఆసక్తికరమైన అంశాలు

Last Updated : Jan 31, 2018, 09:26 PM IST
కేంద్ర బడ్జెట్ 2018 వెనుకున్న ఆర్థిక నిపుణుడి గురించి నాలుగు ముక్కల్లో..

ఇంకొద్ది గంటల్లో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ 2018ని ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ కూర్పులో కీలక పాత్ర పోషించిన ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ గురించి పలు ఆసక్తికరమైన అంశాలు క్లుప్తంగా నాలుగు ముక్కల్లో తెలుసుకునే ప్రయత్నంచేద్దాం

2014 అక్టోబర్ 16న రఘురామ్ రాజన్ స్థానంలో అరవింద్ సుబ్రమణ్యన్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌గా నియమితులయ్యారు. (Reuters photo)

ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న ప్రధాన ఆర్థిక సలహాదారు సుబ్రహ్మణ్యన్.. ఆ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్, ఆక్స్‌ఫర్డ్ లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఉన్నత విద్య పూర్తిచేశారు. (PTI Photo)

కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో ప్రధాన ఆర్థిక సలహాదారు హోదాలో అరవింద్ సుబ్రహ్మణ్యన్ కీలక పాత్ర పోషించారు. దేశాభివృద్ధి, ప్రస్తుత వృద్ధి రేటు, అందుకోవాల్సిన లక్ష్యాలు, ఆర్థిక వనరులు, సామాన్యుల అవసరాలు-ఆశలు, వాణిజ్య వర్గాల అంచనాలు లాంటి ఎన్నో అంశాలని పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ సమకూర్చాల్సి వుంటుంది. ఎన్నికలకు వెళ్లడానికి ముందు చివరి బడ్జెట్ ఇదే కావడంతో ఈ బడ్జెట్‌తో అన్నివర్గాలని ఒప్పించడం ఎంతో అవసరం. లేదంటే ఈ బడ్జెట్ ప్రభావం రానున్న ఎన్నికలపై పడటం ఖాయం. 

అన్నింటికిమించి రెండేళ్ల క్రితం కేంద్రం తీసుకొచ్చిన పాత పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం, గతేడాది ప్రవేశపెట్టిన జీఎస్టీ లాంటి పథకాలు ఈసారి కేంద్ర బడ్జెట్ రూపకల్పనకు పెనుసవాల్‌గా మారాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్ లెక్కలు రూపొందించడం ప్రభుత్వానికే కాదు.. ప్రధాన ఆర్థిక సలహాదారు హోదాలో అరవింద్ సుబ్రహ్మణ్యన్‌కి సైతం కత్తిమీద సాములాంటిదే. (PTI Photo)

కేంద్ర బడ్జెట్ 2018 గురించి ఇటీవల ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధి, ఆర్ధిక వృద్ధి రేటు పెంపు, సామాన్యుని అవసరాలే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ని తీర్చిదిద్దడం జరిగింది అని అన్నారు. (PTI Photo)

Trending News