కేంద్ర బడ్జెట్ 2018 తర్వాత స్మార్ట్ సిటీల అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలు లభించనున్నాయని అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రకటన స్పష్టం చేసింది. 100 స్మార్ట్ సిటీలలో 99 స్మార్ట్ సిటీలకుగాను స్మార్ట్ సిటీల ప్రాజెక్ట్ పేరిట రూ.2.04 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర అరుణ్ జైట్లీ ప్రకటించారు.
దేశాభివృద్ధిలో కీలక భాగమైన మౌళికవసతులని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రారంభించిన స్మార్ట్ సిటీస్ మిషన్ పథకానికి ఊపిరిలూదే ప్రయత్నంలో భాగంగా 99 స్మార్ట్ సిటీలని ఎంపిక చేసిన కేంద్రం, ఆయా నగరాల అభివృద్ధి కోసం రూ.2.04 లక్షల కోట్లు వెచ్చించనున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. అయితే, ఏ ప్రాతిపదికన ఆ కేటాయింపులు జరగనున్నాయనే వివరాలు తెలియడానికి మాత్రం ఇంకాస్త సమయం వేచిచూడక తప్పదు.