Gold Rate Today: దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి పతనం

బులియన్ మార్కెట్‌లో నిన్న స్థిరంగా కొనసాగుతూ ప్రారంభమైన బంగారం ధరలు (Gold Rate Today In India), వెండి ధరలు సాయంత్రానికి పతనమయ్యాయి. నేటి ఉదయం అదే ధరలతో మార్కెట్ ప్రారంభమైంది. వెండి ధర భారీగా దిగొచ్చింది.

Last Updated : Sep 22, 2020, 07:12 AM IST
Gold Rate Today: దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి పతనం

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today), స్వల్పంగా తగ్గాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించింది. హైదరాబాద్‌ (Gold Rate Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.250 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,820 అయింది.  అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,340కి దిగొచ్చింది. 

దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధర (Gold Rate in Delhi) తగ్గింది. తాజాగా రూ.110 మేర స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,760కి పతనమైంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.160 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.50,200 అయింది. 

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) చివరగా రూ.900 మేర భారీగా దిగొచ్చింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.67,000 వద్ద మార్కెట్ ట్రేడ్ అవుతోంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద మార్కెట్ అవుతుంది. CoronaVirus: కళ్లద్దాలు ధరిస్తే ఎంత వరకు ప్రయోజనం ఉందంటే!

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

 

Trending News