TCS Jobs: టీసీఎస్‌లో ఆఫ్ క్యాంపస్‌ డ్రైవ్, రెండు ప్రక్రియల్లోనే ఉద్యోగం

TCS Jobs And Recruitment: టీసీఎస్‌లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రిక్రూట్ మెంట్‌ డ్రైవ్‌కు చివరి తేదీ ఇంకా ప్రకటించలేదు. ఇందుకు సంబంధించిన విద్యా అర్హతలు, పరీక్ష విధానం తదితర వివరాలు ఇదిగో.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2022, 10:11 AM IST
  • టీసీఎస్‌లో ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు
  • రెండు రౌండ్ల ద్వారా ఉద్యోగానికి ఎంపిక
TCS Jobs: టీసీఎస్‌లో ఆఫ్ క్యాంపస్‌ డ్రైవ్, రెండు ప్రక్రియల్లోనే ఉద్యోగం

Tata Consultancy Services Jobs: టీసీఎస్‌లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోన్న వారికి గుడ్‌ న్యూస్. ఇంజనీర్లు, ఎంసీఎ, ఎమ్మెస్సీ డిగ్రీ హోల్డర్లు కంపెనీ నిర్వహిస్తోన్న ఆఫ్ క్యాంపస్ (Off Campus) ఇంటర్వ్యూలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ వెబ్‌సైట్‌లో అందించిన వివరాల ప్రకారం...2020 లేదా 2021లో ఉత్తీర్ణత సాధించిన బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ డిగ్రీ హోల్డర్స్‌ అంతా ఈ డ్రైవ్‌కు అర్హులు.

ఇక 2019 ఉత్తీర్ణత సంవత్సరానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు కంపెనీ పేర్కొంది. పది, పన్నెండో తరగతి, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షలలో అభ్యర్థుల కనీస 60 శాతం మార్కులు కలిగి ఉండాలి. అభ్యర్థులు వయస్సు తప్పనిసరిగా 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే రెండు సంవత్సరాల వరకు పని అనుభవం కలిగి ఉండాలి.

టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ (Off Campus Drive) ఎంపిక విధానం రెండు రౌండ్ల ద్వారా ఉంటుంది. మొదట రాత పరీక్ష ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేస్తారు. 

ఇక రాత పరీక్షలు ఇప్పటికే జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ తేదీని బట్టీ డ్రైవ్‌ను నిర్ణయిస్తారు. ఇక రాత పరీక్షలో రెండు భాగాలు ఉంటాయి. పార్ట్ ఏలో కాగ్నిటివ్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. అలాగే పార్ట్ బీలో ప్రోగ్రామింగ్ స్కిల్స్‌పై పరీక్ష ఉంటుంది. ఏ, బీ పార్ట్స్‌కు 120, 180 నిమిషాలు సమయ వ్యవధి ఉంటుంది.ఇక అభ్యర్థుల రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను TCS iON ద్వారా వెల్లడిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ ఇంటర్వ్యూ డిటేల్స్‌ కూడా పంపుతారు. 

టీసీఎస్‌లో (TCS) ఉద్యోగాల కోసం ఇలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. క్యాంపస్ డ్రైవ్‌కు సంబంధించి అన్ని అర్హతలున్న అభ్యర్థులు టీసీఎస్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం ఇక్కడ క్లిక్ చేయండి. అలాగే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు.. వారు ‘ఐటీ’ కేటగిరీ కింద వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

డ్రైవ్ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు "ట్రాక్ యువర్ అప్లికేషన్‌"ను చెక్ చేయడం ద్వారా స్టేటస్‌ను నిర్ధారించవచ్చు. స్టేటస్‌ “అప్లయిడ్‌ ఫర్‌‌ డ్రైవ్” గా చూపించాల్సి ఉంటుంది. అయితే ఈ డ్రైవ్ (Drive) కోసం దరఖాస్తు చేసుకునేందుకు టీసీఎస్ చివరి తేదీని ప్రకటించినప్పటికీ. వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం మంచిది. ఇక ఇందుకు సంబంధించి అభ్యర్థులకు ఏదైనా సహాయం కావాలంటే... టీసీఎస్ (TCS) హెల్ప్‌డెస్క్ టీమ్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. 18002093111 హెల్ప్‌లైన్ నంబర్‌‌ను సంప్రదించవచ్చు. లేదంటే ilp.support@tcs.com అనే మెయిల్‌ ఐడీకి మెయిల్‌ పంపవచ్చు.

Also Read: PR Sreejesh Award: అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన భారత హాకీ గోల్ కీపర్ శ్రీజేష్

Also Read: Medaram Jatara Bus Timings: మేడారం జాతరకు స్పెషల్ బస్సులు.. ఏఏ సమయాల్లో అందుబాటులో ఉంటాయంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News