తమిళనాడులో నేడు కేబుల్ టీవీ ప్రసారాలను బంద్

కావేరీ వాటర్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తమిళనాడులో కొనసాగుతున్న ఆందోళన మరింత ఉధృతం చేయనున్నట్లు వివిధ పార్టీలు పేర్కొన్నాయి.

Last Updated : Apr 17, 2018, 07:52 AM IST
తమిళనాడులో నేడు కేబుల్ టీవీ ప్రసారాలను బంద్

కావేరీ వాటర్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తమిళనాడులో కొనసాగుతున్న ఆందోళన మరింత ఉధృతం చేయనున్నట్లు వివిధ పార్టీలు పేర్కొన్నాయి. కాగా కావేరీ వాటర్ బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా నేడు మూడు గంటల పాటు కేబుల్ టీవీ ప్రసారాలను బంద్ చేయనున్నామని తమిళనాడు కేబుల్ టివి ఆపరేటర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ రోజు(ఏప్రిల్ 17న) మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ టీవీ కార్యక్రమాలను ప్రసారం చేయకూడదని నిర్ణయించినట్లు తెలిపాయి.  

తమిళనాడు కేబుల్ టివి ఆపరేటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ మాట్లాడుతూ, కావేరీ వాటర్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ, మంగళవారం, 17 ఏప్రిల్ న  కేబుల్ టివి కార్యక్రమాల ప్రసారాలను మధ్యాహ్నం 3.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు నిలిపివేస్తున్నాము' అన్నారు.

ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ద్వారా కావేరీ సమస్య పరిష్కారం కాదని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యాఖ్యానించారు. చట్టపరంగా వెళితేనే సమస్య నుంచి బయటపడతామని పేర్కొన్నారు. ఆదివారం చెన్నై విమానాశ్రయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కావేరీ ఘటనపై సుప్రీం కోర్టు స్పందిస్తూ మే 3 కల్లా కేంద్రం ముసాయిదాను రూపొందించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రధానికి మెమో అందజేశానని పళని తెలిపారు. మాజీ సీఎం జయలలిత ఆరోగ్యంపై మాజీ చీఫ్ సెక్రటరీ పి. రామ్మోహన్‌ రావు తప్పుడు సమాచారం అందించారని పళని వెల్లడించారు.

Trending News