ఢిల్లీలో వాయు కాలుష్యం, సెంట్రల్ విస్టా పనులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

దేశ రాజధాని నగరం ఢిల్లీ ఊపిరి పీల్చుకోలేకపోతోంది. వాయు కాలుష్యం రోజురోజుకూ దిగజారిపోతూ నగర ప్రజలకు శ్వాస అందని పరిస్థితి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 30, 2021, 08:43 AM IST
  • ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు
  • ఢిల్లీలో కూల్చివేతలు, నిర్మాణాలపై నిషేధాజ్ఞల ఉల్లంఘనపై సుప్రీంకోర్టు ఆగ్రహం
  • సెంట్రల్ విస్టా పనుల కొనసాగింపుపై వివరణ కోరిన సుప్రీంకోర్టు ధర్మాసనం
 ఢిల్లీలో వాయు కాలుష్యం, సెంట్రల్ విస్టా పనులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

దేశ రాజధాని నగరం ఢిల్లీ ఊపిరి పీల్చుకోలేకపోతోంది. వాయు కాలుష్యం రోజురోజుకూ దిగజారిపోతూ నగర ప్రజలకు శ్వాస అందని పరిస్థితి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)కాలుష్యపు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 419కు పెరిగిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత కొద్దిరోజులుగా అంటే దీపావళి అనంతరం ఢిల్లీలో ఈ పరిస్థితి నెలకొంది. వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటంతో ఢిల్లీలో స్కూల్స్‌కు సెలవులిచ్చేశారు. మరోవైపు ఢిల్లీలో కట్టడాల నిర్మాణం, కూల్చివేతలపై నిషేధం అమల్లో ఉంది. ఈ నేపధ్యంలో ఢిల్లీలో సెంట్రల్ విస్టా పనుల్ని మోదీ ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగిస్తోందంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

సెంట్రల్ విస్టా పనుల కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వంపై(Central government) సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరంలో కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం ఉన్నా సరే..ప్రభుత్వం సెంట్రల్ విస్టా పనులు కొనసాగిస్తుందా అని ప్రభుత్వం తరపున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని..కాలుష్య నియంత్రణపై రాష్ట్రాలకు ఆదేశాలిచ్చామంటున్నారని..కానీ వాస్తవంలో మాత్రం శూన్యమని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ (Justice nv ramana) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధం అమల్లో ఉన్నా..కాలుష్యం(Delhi Air Quality Index) ఎందుకు పెరుగుతుందో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమీషన్ ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల్ని నివేదిక కోరింది సుప్రీంకోర్టు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో(Central Vista Project) కొనసాగుతున్న నిర్మాణపనులు దుమ్ము, కాలుష్యాన్ని పెంచుతున్నాయా లేదా అనేది చెప్పాలని కోరింది. కేసు విచారణను డిసెంబర్ 2వ తేదీకు వాయిదా వేసింది.

Also read: Covaxin: కొవాగ్జిన్ ఎగుమతులు పునః ప్రారంభించిన భారత్ బయోటెక్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News