Arvind Kejriwal's Furniture: అరవింద్ కేజ్రీవాల్‌పై మరిన్ని సంచలన ఆరోపణలు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కి సుఖేష్ లేఖ

Furniture at Arvind Kejriwal's Residence: మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా అరెస్ట్ అయి విచారణ ఖైదీగా మండోలి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు జైలు నుంచే మరో లేఖ రాశాడు. ఈసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌ను ఉద్దేశించి పలు ఆరోపణలు చేస్తూ లేఖ రాసిన సుఖేష్ చంద్రశేఖర్.. ఆ లేఖను తన న్యాయవాది అనంత మాలిక్ ద్వారా విడుదల చేశాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 6, 2023, 11:32 PM IST
Arvind Kejriwal's Furniture: అరవింద్ కేజ్రీవాల్‌పై మరిన్ని సంచలన ఆరోపణలు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కి సుఖేష్ లేఖ

Furniture at Arvind Kejriwal's Residence: అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి సంబంధించి విలువైన ఫర్నిచర్‌పై విచారణ చేయాలని సుఖేష్ చంద్రశేఖర్ ఈ లేఖ ద్వారా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ని కోరాడు. వాట్సాప్, ఫేస్‌టైం చాట్లలో తాను పంపించిన ఫోటోలు ఆధారంగానే అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ ఫర్నిచర్ సెలెక్ట్ చేసినట్టు సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపించాడు. అరవింద్ కేజ్రీవాల్ కొనుగోలు చేసిన ఫర్నిచర్ వివరాలను సుఖేష్ చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నాడు. 

సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. 45 లక్షల రూపాయల విలువైన డైనింగ్ టేబుల్, 34 లక్షల రూపాయల విలువైన డ్రెస్సింగ్ టేబుల్స్, 18 లక్షల రూపాయల విలువైన అద్దాలు, 28 లక్షల రూపాయల విలువచేసే బెడ్ రూమ్ సామాగ్రి, 45 లక్షల రూపాయల విలువచేసే వాల్ క్లాక్స్ వంటి ఖరీదైన ఫర్నిచర్ ని ఇటలీ, ఫ్రాన్స్ ముంబై నుంచి అరవింద్ కేజ్రివాల్ నివాసానికి రిషబ్ శెట్టి తీసుకుని వెళ్లినట్టు సుఖేష్ చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నాడు.  

తాను గతంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చిన బిల్లులతో ఫర్నిచర్ వాల్యుయేషన్ ని పోల్చి చూడాల్సిందిగా సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ని కోరాడు. వీటన్నిటిని పరిశీలిస్తే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు లగ్జరీ లైఫ్‌ అనుభవించాలనే కోరిక ఎంత ఎక్కువగా ఉందో ఇట్టే అర్థం అవుతుంది అని సుఖేష్ అభిప్రాయపడ్డాడు. కేవలం ఫర్నిచర్ మాత్రమే కాకుండా వెండి పాత్రలు కూడా కావాలని అరవింద్ కేజ్రీవాల్ తనను కోరినట్టు సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపించాడు. అంతేకాదు... అరవింద్ కేజ్రీవాల్ కోరిక మేరకు 90 లక్షల రూపాయల విలువ చేసే 15 వెండి భోజనం ప్లేట్లు, 20 గ్లాసులు, ఇతర వెండి గిన్నెలు, స్పూన్స్, వెండి విగ్రహాలను కొనుగోలు చేసినట్టు సుఖేష్ చంద్రశేఖర్ అంగీకరించాడు. దక్షిణ భారత దేశానికి చెందిన ఒక ఫేమస్ జువెలరీ షాపులో అరవింద్ కేజ్రీవాల్ కోసం ఆ వెండి వస్తువులను కొనుగోలు చేశానని.. అందుకోసం కిక్ బ్యాక్ కరోల్ బాగ్ అనే ప్రాజెక్టు పేరు ఉపయోగించుకున్నట్టు తెలిపాడు. 

తాను లేఖలో ప్రస్తావించిన అన్ని అంశాలను గతంలో తాను ఇచ్చిన బిల్లులతో సరిపోల్చి చూడడంతో పాటు సంబంధిత దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాల్సిందిగా సుఖేష్ చంద్రశేఖర్ ఆ లేఖలో కోరాడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా తీహార్ జైలుకి రావాల్సిందేనని.. కేజ్రీవాల్ కోసం జైలులో సెల్ రెడీగా ఉందని గతంలో సుఖేష్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా రాజకీయ పరిశీలకులు గుర్తుచేసుకుంటున్నారు.

Trending News