Covid19 vaccine: వ్యాక్సిన్ మూడవదశ ప్రయోగాలు సక్సెస్..జనవరి నాటికి వ్యాక్సిన్

కరోనా వైరస్ సంక్రమణ తగ్గకుండానే కరోనా థర్డ్ వేవ్ ప్రకటన ఢిల్లీలో భయం గొలుపుతున్న పరిస్థితి. ఈ నేపధ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ శుభవార్త అందిస్తోంది. కరోనా వ్యాక్సిన్ మూడవ దశ పరీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయని స్పష్టం చేసింది.

Last Updated : Nov 4, 2020, 11:30 PM IST
Covid19 vaccine: వ్యాక్సిన్ మూడవదశ ప్రయోగాలు సక్సెస్..జనవరి నాటికి వ్యాక్సిన్

కరోనా వైరస్( Corona virus )  సంక్రమణ తగ్గకుండానే కరోనా థర్డ్ వేవ్ ప్రకటన ఢిల్లీ ( Delhi ) లో భయం గొలుపుతున్న పరిస్థితి. ఈ నేపధ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum institute )  శుభవార్త అందిస్తోంది. కరోనా వ్యాక్సిన్ మూడవ దశ పరీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయని స్పష్టం చేసింది.

ఇండియాలో కరోనా  వైరస్ సంక్రమణ భయం తొలగకముందే..ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Delhi cm aravind kejriwal ) చేసిన ప్రకటన ఆందోళన కల్గిస్తోంది. ఓ వైపు సెకండ్ వేవ్ గురించి భయపడుతున్న తరుణంలో ఏకంగా థర్డ్ వేవ్ ప్రవేశించిందని చెప్పడం నిజంగానే ఆందోళన కల్గించే పరిణామం.

ఈ క్రమంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఓ శుభవార్త అందించింది. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో ఫ్రంట్ రన్నర్ గా ఉన్నటువంటి సీరమ్ ఇనిస్టిట్యూట్ సంస్థ...ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనెకా ( Oxford-AstraZeneca ) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ తో ఒప్పందం  కుదుర్చుకుంది. ఈ వ్యాక్సిన్ మూడవ దశ ప్రయోగాల్ని ఇండియాలో సీరమ్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తోంది. ఇండియాలో కోవిషీల్డ్ ( Covishield )పేరుతో ఈ వ్యాక్సిన్ తయారుకానుంది. ఇండియాలో 17 నగరాల్లో 16 వందలమంది వాలంటీర్లపై కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రయోగం జరుగుతోంది. ఫేజ్ 2, 3 ప్రయోగాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని...ప్రయోగాలు సక్సెస్ అంటూ సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అధార్ పూణావాలా తెలిపారు. 

కోవిడ్ 19 వ్యాక్సిన్( Covid19 vaccine ) ను వచ్చే యేడాది జనవరిలో అందుబాటులో వస్తుందని స్పష్టం చేశారు. సురక్షితమైన, సమర్ధవంతమైన వ్యాక్సిన్ అందిస్తామన్నారు. తొలిదశలో 7 కోట్ల డోసులు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు సంబంధించి భారత్ సహా బ్రిటన్ లో ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయినప్పటికీ, ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి సకాలంలో అనుమతి రావల్సి ఉందన్నారు. తొలి దశలో నెలకు 6 నుంచి 7 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నామని, తదుపరి దశలో పది కోట్లకు పెంచుతామన్నారు.  Also read: Rafale: ఇండియాకు చేరుకున్న మరో మూడు రఫేల్ యుద్ద విమానాలు

Trending News