Southwest Monsoon: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు..ఆయా రాష్ట్రాల్లో రెడ్‌ అలర్ట్ జారీ..!

Southwest Monsoon: దేశవ్యాప్తంగా నైరుతి రుతు పవనాలు బలపడుతున్నాయి. వీటి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Written by - Alla Swamy | Last Updated : Jul 10, 2022, 12:33 PM IST
  • బలపడుతున్న రుతు పవనాలు
  • దేశవ్యాప్తంగా భారీ వర్షాలు

  • పలు రాష్ట్రాల్లో హెచ్చరికలు
Southwest Monsoon: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు..ఆయా రాష్ట్రాల్లో రెడ్‌ అలర్ట్ జారీ..!

Southwest Monsoon: దేశవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో చెరువులు, వాగులు, వంకలు పొంగిపోర్లి ప్రవహిస్తున్నాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాది, దక్షిణాదిలో ఇదే వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణ, ఏపీ, గుజరాత్, మహారాష్ట్రలో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

గత మూడురోజుల నుంచి ముసురు పట్టుకుంది. మహారాష్ట్రలోని గడ్చిరౌలిలో వరదలు తలెత్తాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాంధేడ్, హింగోలి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. కర్ణాటక, తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో ఐదు రోజులపాటు దేశ మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఇదే వాతావరణం ఉండనుంది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే యూపీలో పిడుగుల కారణంగా ఐదుగురు మృత్యువాత పడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు సంభవించాయి. అస్పాంలో పరిస్థితి అదుపులోకి వస్తోందని అధికారులు తెలిపారు.

Also read:Telangana Rains:వామ్మో ఇవేం వానలు.. తెలంగాణలో 85 శాతం అధిక వర్షపాతం.. ఏడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్!

Also read:Ante Sundaraniki: నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తున్న అంటే సుందరానికి

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News