ఎప్పుడూ చల్లటి వాతావరణంతో వణికించే హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం మంచుతో భయపెడుతోంది. గత కొద్ది రోజులుగా ఆగకుండా కురుస్తోన్న మంచు హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలను మంచు దుప్పటితో కప్పేస్తోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో, కొండల మధ్యన ఉన్న గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే ఆగకుండా కురుస్తోన్న మంచు కారణంగా అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు సైతం నిలిచిపోతున్నాయి. పలు చోట్ల కొండ ప్రాంతాల్లో వందల సంఖ్యలో చిక్కుకుపోయిన యాత్రికులు, స్థానికులను హిమాచల్ ప్రదేశ్ సర్కార్ ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టి సహాయ శిబిరాలకు, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
భారీగా కురుస్తోన్న మంచు.. సర్కార్ చేపడుతున్న రెస్యూ ఆపరేషన్స్కి తీవ్ర అడ్డంకిగా మారింది. అందుకు ఉదాహరణే ఈ ఫోటోలు.