ఆ సీఎంకి.. 15 లక్షలు జరిమానా

  

Last Updated : Nov 9, 2017, 06:45 PM IST
ఆ సీఎంకి.. 15 లక్షలు జరిమానా

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీపై సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సఛేంజ్ బ్యూరో ఆఫ్ ఇండియా) జరిమానా విధించి తాజాగా వార్తల్లో నిలిచింది. ఆయన చేస్తున్న వ్యాపారంలో పలు మోసాలకు రూపానీ పాల్పడినట్లు భావించి, రూ.15 లక్షలు చెల్లించమని నోటీసు పంపింది. తాజాగా సెబీ 22 సంస్థలకు ఈ విధమైన నోటీసులు జారీ చేసింది. ఈ సంస్థలన్నింటికీ కలిసి దాదాపు 6.9 కోట్లు జరిమానా విధించినట్లు సమాచారం. ఆ సంస్థల్లో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి చెందిన లిస్టెడ్ కంపెనీ సారంగ్ కెమికల్స్ కూడా ఉండడం గమనార్హం. సారంగ్ కెమికల్స్ పలు అక్రమాలకు పాల్పడినట్లు సెబీ భావించి ఈ జరిమానాను విధిస్తున్నట్లు ప్రకటించింది. 2011 జనవరి-జూన్ మధ్య కాలంలో ఈ మోసాలు జరిగినట్లు సెబీ తన వెబ్‌సైట్‌లో కూడా తెలిపింది. విజయ్ రూపానీ గత ఏడాది గుజరాత్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే.

 

Trending News