AP Assembly Results 2024: ఏపీ ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, అధికారం ఎవరిది

AP Assembly Results 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. మరి కొద్దిగంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో కూడా స్పష్టత లేకపోవడంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో మరో రెండు సంస్థలు ఆ పార్టీదే అధికారమని తేల్చిచెప్పాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 3, 2024, 08:20 AM IST
AP Assembly Results 2024: ఏపీ ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, అధికారం ఎవరిది

AP Assembly Results 2024: జూన్ 1 సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ జాతీయ స్థాయిలో ఊహించిన అంచనాలే వెలువరించినా ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం మిశ్రమంగా వ్యవహరించాయి. ఒక్కో సంస్థ ఒక్కో రకంగా అంచనా ఇచ్చింది. మరో రెండు సంస్థలు విడుదల చేసిన అంచనా ఫలితాలు ఆ పార్టీలో ఉత్సాహం నింపుతున్నాయి. అధికారం ఆ పార్టీదే అని తేల్చి చెప్పేశాయి ఈ రెండు సంస్థలు. 

ఏపీ అసెంబ్లీ ఫలితాలపై విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఏపీలో అధికారం ఎవరిదనే విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోయాయి. కారణ కొన్ని సంస్థలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు పట్టం కడితే, మరికొన్ని పార్టీలు తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని చెప్పాయి. కౌంటింగ్‌కు ఇక మిగిలింది గంటల వ్యవధి మాత్రమే. దాంతో అందరిలో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇప్పుడు మరో రెండు సంస్థలు సెంటర్ ఫర్ పోలిటిక్స్ అండ్ పాలసీ స్డడీస్, టైమ్స్ నౌ ఈటీజీ సంస్థలు ఏపీలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అధికారమని తెల్చి చెప్పేశాయి. 

సెంటర్ ఫర్ పోలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ అంచనాలు ఇలా

ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు 9-105 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది. ఇక 14-17 లోక్‌సభ స్థానాలు కూడా గెల్చుకుంటుందని అభిప్రాయపడింది. అయితే 2019 ఉన్న ఫ్యాన్ ప్రభంజనం ఈసారి ఉండదని తెలిపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు 49 శాతం ఓట్లు పడ్డాయని ఈ సంస్థ తెలిపింది. ఇందులో అదికంగా మహిళలు అధికార పార్టీని ఎంచుకున్నారని వెల్లడించింది. వీరితో పాటు మెజార్టీ సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ఓట్లు వైసీపీకే పడ్డాయని తెలిపింది. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమికి 75-85 అసెంబ్లీ, 8-11 లోక్‌సభ స్థానాలు దక్కవచ్చని స్పష్టం చేసింది. మహిళల ఓట్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినట్టుగా సీపీపీఎస్ సంస్థ అంచనా వేసింది. 

టైమ్స్ నౌ ఈటీజీ అంచనా

ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ప్రకారం ఏపీలో ఈసారి తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో వస్తుంది. కానీ టైమ్స్ నౌ ఈటీజీ మాత్రం అందుకు భిన్నంగా తెలిపింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 117-125 సీట్లతో వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేసింది. అధికార పార్టీ మొత్తం 51 శాతం ఓట్లు సొంతం చేసుకుంటుందని వివరించింది. టైమ్స్ నౌ సంస్థ కూడా 15 శాతం అధికంగా నమోదైన మహిళల ఓట్లు వైసీపీకు పోల్ అయినట్టుగా తెలిపింది. 

Also read: AP Assembly Results: ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా నేను చెప్పిందే జరుగుతుంది

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News