Ys Jagan: జూన్ 6న ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం, ఫలితం జగన్‌కు తెలుసా

Ys Jagan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు మరి కొద్దిగంటల సమయం మిగిలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రం విజయంపై పూర్తి ధీమాతో ఉన్నారు. పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 3, 2024, 10:33 AM IST
Ys Jagan: జూన్ 6న ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం, ఫలితం జగన్‌కు తెలుసా

Ys Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విభిన్నంగా ఉండటంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ మరింతగా పెరిగిపోయింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తరువాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 6న కీలక సమావేశం ఏర్పాటు చేశారు. 

ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు. కౌంటింగ్ విషయంలో కీలక సూచనలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ తరువాత వైసీపీ నేతలు కొందరు నిరుత్సాహానికి లోనయ్యారు. జాతీయ సంస్థలు చాలావరకూ కూటమికే పట్టం కడుతుండటంతో వైసీపీ నేతల్లో హుషారు తగ్గింది. కానీ ఫలితాల విషయంలో, అధికారం విషయంలో వైఎస్ జగన్ విశ్వాసం చూసిన తరువాత పార్టీ నేతల్లో తిరిగి హుషారు వచ్చేసింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వైఎస్ జగన్ అంత సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తోంది. ఎందుకంటే పోలింగ్ రోజు, తరువాత మూడు సర్వే సంస్థలతో అత్యంత రహస్యంగా చేయించుకున్న ఫలితాల రిపోర్ట్ జగన్ దగ్గరుంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఐప్యాక్ సమావేశంలో 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడూ అదే విశ్వాసంతో ఉన్నారు. గెలుపు విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భారీ విజయం దక్కనుందని ధీమా వ్యక్తం చేశారు. 

అందుకే ఫలితాల తరువాత జూన్ 6వ తేదీన కీలక సమావేశం ఏర్పాటు చేశారు. గెలిచిన ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ తాడేపల్లిలో అందుబాటులో ఉండాలనే సూచనలు జారీ అయ్యాయి. ఇప్పటికే జూన్ 9వ తేదీన విశాఖపట్నం ఆంధ్రా యుూనివర్శిటీ గ్రౌండ్స్‌లో  ప్రమాణ స్వీకారం ఉంటుందని నిర్ణయించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా మరోసారి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని వైఎస్ జగన్ అత్యంత ధీమాతో ఉన్నారు. పోలింగ్ సరళి, వివిధ ఎగ్జిట్ పోల్స్ తరువాత కూడా జగన్‌లో ధీమా, విశ్వాసం ఎక్కడా తగ్గలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. 

ఒకవేళ పోటా పోటీ పరిస్థితి వచ్చినా ఏం చేయాలి, ఎమ్మెల్యేల్ని ఎలా పట్టి ఉంచాలనే వ్యూహం కూడా వైఎస్ జగన్ సిద్ధం చేసినట్టు సమాచారం. కూటమి పార్టీలక కదలికలపై కన్నేసినట్టు తెలుస్తోంది. అందుకే ముందస్తుగా పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. 

Also read: AP Assembly Results 2024: ఏపీ ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, అధికారం ఎవరిది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News