Telangana Secretariat: రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం.. సచివాలయంలో భారీ మార్పులు

Vastu Changes In Telangana State Secretariat: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తుపై విమర్శలు చేసిన రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన కూడా వాస్తు మార్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 3, 2024, 05:59 PM IST
Telangana Secretariat: రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం.. సచివాలయంలో భారీ మార్పులు

Telangana Secretariat: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన మరుసటి రోజే కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర పాలనకు కేంద్రంగా ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో వాస్తు మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం పై అంతస్తుకు మారుతుండగా.. ప్రవేశ ద్వారం.. నిష్క్రమణ మార్గంలో కూడా మారనున్నాయి. ఈ మేరకు సచివాలయంలో వాస్తు మార్పులు జరుగుతున్నాయని సమాచారం. కాగా వాస్తు మార్పులపై ఆసక్తికర చర్చ జరిగింది. గతంలో కేసీఆర్‌ వాస్తు మార్పులపై ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆయన కూడా వాస్తు మార్పులు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.

Also Read: Bakrid Holiday: ప్రజలకు శుభవార్త..  2 రోజులు సెలవులు ప్రకటించిన తెలంగాణ.. ఎందుకంటే..?

సచివాలయంలో ఇప్పటివరకు ప్రధాన కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి రాకపోకలు సాగించేవారు. అయితే వాస్తు నిపుణుల సూచనల మేరకు రాకపోకల మార్గం మార్చి వేశారు. రేవంత్‌ రెడ్డి కాన్వాయ్‌ పశ్చిమం వైపు నుంచి సచివాలయం లోపలికి ప్రవేశించనుంది. తూర్పు వైపు మార్గం గుండా బయటకు రానుంది. ఈ మేరకు సచివాలయ అధికారులు మార్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సచివాలయం ఎదురుగా ఉన్న ప్రధాన ద్వారానికి తాడుతో మూసివేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా మారనుంది.

Also Read: Exit Polls KCR: గెలిచినా.. ఓడినా తెలంగాణ రక్షణ కవచం బీఆర్‌ఎస్‌ పార్టీ

సచివాలయం నిర్మాణ సమయంలోనే ముఖ్యమంత్రి కార్యాలయం ఆరో అంతస్తులో నిర్మించారు. కేసీఆర్‌కు కలిసొచ్చిన ఆరో నంబర్‌తోనే సచివాలయంలో కార్యాలయం ఏర్పాటుచేసుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు నెలలపాటు కేసీఆర్‌ పని చేసిన కార్యాలయంలోనే రేవంత్‌ రెడ్డి పని చేశారు. అయితే మార్పు పేరు మీద అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సచివాలయంలో కూడా మార్పులు చేయనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆరో అంతస్తు నుంచి తొమ్మిదో అంతస్తుకు మార్చనున్నారు.

అయితే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్‌ రెడ్డి పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌లో కూడా వాస్తు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఆ మార్పులతోనే తాను ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాననే భావనలో రేవంత్‌ ఉన్నారు. అధికారంలోకి వచ్చాక కూడా సచివాలయంలో తన మార్క్‌ చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సచివాలయంలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందే రోజు ఈ మార్పులు చేయడం ఆసక్తికరంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News