AP Assembly Results: ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా నేను చెప్పిందే జరుగుతుంది

AP Assembly Results: ఇటీవల కొద్దికాలంగా వార్తల్లో నిలుస్తున్న వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ మోడర్న్ జ్యోతిష్యుడు వేణు స్వామి. సినీ తారలు, రాజకీయ నేతల గురించి కీలక విషయాలతో సంచలనమైన వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యల్ని రిపీట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 3, 2024, 07:29 AM IST
AP Assembly Results: ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా నేను చెప్పిందే జరుగుతుంది

AP Assembly Results: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు కొన్ని గంటల వ్యవధి మిగిలుంది. ఇప్పటికే జూన్ 1 సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఏపీ విషయంలో మిశ్రమంగా స్పందించాయి. కొన్ని అధికార పార్టీకు పట్టం కడితే మరికొన్ని కూటమిదే అధికారమన్నాయి. మరి సంచలన జ్యోతిష్యుడు వేణు స్వామి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

ఏపీలో అసెంబ్లీ ఫలితాలపై ఓటరు నాడి ఇంకా అంతుబట్టడం లేదు. ఎగ్జిట్ పోల్స్ కూడా మిశ్రమంగా అంచనాలు వ్యక్తం చేయడంలో అందరికీ ఉత్కంఠ పెరిగిపోతోంది. జాతీయ సంస్థల్లో మెజార్టీ మాత్రం తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమికి పట్టం కడుతున్నాయి. 1-2 జాతీయ సంస్థలు, ఇతర స్థానిక సర్వే సంస్థలు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అదికారమంటున్నాయి. ఈ నేపధ్యంలో ఏ సర్వే సంస్థ ఏం చెప్పినా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మాత్రం మరోసారి గతంలో చేసిన వ్యాఖ్యల్నే రిపీట్ చేశారు. రోజుకో మాట మాట్లాడేందుకు తానేమీ రాజకీయ నాయకుడిని కాదని, జ్యోతిష్యుడినని ఒకే మాటపై నిలబడతానని చెప్పుకొచ్చారు. గతంలో చాలా సందర్భాల్లో చెప్పిందే జరుగుతుందన్నారు. ఏ ఎగ్జిట్ పోల్ ఏం చెప్పినా ఏపీలో ఈసారి అధికారంలో వచ్చేది మరోసారి జగనే అని వేణు స్వామి స్పష్టం చేశారు. 

జాతకం ప్రకారం వైఎస్ జగన్‌ది ఆరుద్ర నక్షత్రమని 2023 నుంచి అష్టమ శని ప్రారంభమై మరో రెండేళ్లుంటుందన్నారు. ప్రస్తుతం ఈ అష్టమ శని మంచి స్థితిలో ఉన్నందున మరోసారి ముఖ్యమంత్రి యోగం వైఎస్ జగన్‌కు కచ్చితంగా ఉందన్నారు. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం కాగా పవన్ కళ్యాణ్‌ది ఉత్తరాషాఢ నక్షత్రమన్నారు. 202 జూన్ వరకూ శని ప్రభావం ఉంటుందన్నారు. బీజేపీతో పొత్తు తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైందన్నారు. 

కొన్ని ఎగ్జిట్ పోల్స్ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారంటూ ఇప్పుడు చెబుతున్నాయని, తాను మాత్రం మొదట్నించి అదే చెబుతున్నానని గుర్తు చేశారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. జాతకరీత్యా బలంగా ఉన్నందున మరో 17 ఏళ్లు వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. ఇప్పుడే కాదు 2029 ఎన్నికల్లో సైతం జగనే ముఖ్యమంత్రి అని మరోసారి జోస్యం చెప్పారు. 

Also read: AP Rains Alert: విస్తరిస్తున్న నైరుతి, ఏపీలో నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News