Schools to reopen : జనవరి 24 నుంచి మళ్లీ స్కూల్స్ ప్రారంభం, 1 నుంచి 12 తరగ‌తి వ‌ర‌కు క్లాస్‌లు

Schools to reopen from Monday : జనవరి 24 నుంచి మళ్లీ ఒకటి నుంచి 12వ తరగ‌తి వ‌ర‌కు స్కూల్స్ ప్రారంభం. కొవిడ్ కేసులు పెద్ద ఎత్తున వస్తున్నా కూడా కీలక నిర్ణయం తీసుకున్న మహా ప్రభుత్వం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2022, 04:28 PM IST
  • కొవిడ్ క‌ల్లోలం సృష్టిస్తున్నా కీలక నిర్ణయం
  • మూతపడిన విద్యాసంస్థల్ని మళ్లీ తెరిచేందుకు రంగం సిద్ధం
  • వచ్చే వారం నుంచే అన్ని స్కూల్స్‌ ఓపెన్‌
Schools to reopen : జనవరి 24 నుంచి మళ్లీ స్కూల్స్ ప్రారంభం, 1 నుంచి 12 తరగ‌తి వ‌ర‌కు క్లాస్‌లు

Maharashtra schools to reopen : కొవిడ్‌ మ‌హ‌మ్మారి విద్యావ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. కరోనా కేసుల సంఖ్య పెరిగితే చాలు, ఫస్ట్‌ క్లోజ్‌ చేసేది విద్యాసంస్థలనే. స్కూల్స్, కాలేజీలన్నింటినీ మూసేస్తారు. ఇలా కొవిడ్ (Covid) వల్ల విద్యావ్యవస్థ తీవ్రంగా నష్టపోతోంది. దీంతో విద్యాప్ర‌మాణాలు దారుణంగా పడిపోతున్నాయి. 

ఒకవైపు కొవిడ్ క‌ల్లోలం సృష్టిస్తున్నా కూడా మూతపడిన విద్యాసంస్థల్ని మళ్లీ తెరిచేందుకు సిద్ధమవుతోంది మహారాష్ట్ర ప్రభుత్వం. వచ్చే వారం నుంచే అక్కడ అన్ని స్కూల్స్‌ ఓపెన్‌ కానున్నాయి. అన్ని తరగతులు ప్రారంభిస్తామ‌ంటూ తాజాగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ (Minister Varsha Gaikwad) వెల్లడించారు. 

అయితే అన్ని స్కూల్స్, కాలేజీల్లో కొవిడ్ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించేలా చేస్తామని మంత్రి పేర్కొన్నారు. జనవరి 24 నుంచి ఒకటో త‌ర‌గ‌తి నుంచి 12వ తరగ‌తి వ‌ర‌కు క్లాస్‌లు ప్రారంభం అవుతాయని వర్ష గైక్వాడ్ పేర్కొన్నారు. ఇక మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ ప్రతిపాద‌న‌కు ఆమోదం తెలిపారని మంత్రి గైక్వాడ్ తెలిపారు. 

అయితే మహారాష్ట్రలో ఒకవైపు ఒమిక్రాన్‌, డెల్టా వేరియెంట్‌ల కేసులు పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 15 వ‌ర‌కు స్కూళ్ల‌ను (Schools) మూసి వేస్తున్న‌ట్లు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే కొన్ని వ‌ర్గాల నుంచి స్కూళ్ల‌ను ఓపెన్ చేయాల‌నే డిమాండ్ వచ్చింది.

Also Read : NyQuil Chicken: దగ్గు సిరప్‌తో చికెన్ రెసిపీ.. ఆరోగ్యానికి మంచిదేనా? డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసా!!

దీంతో నిపుణులతో కొవిడ్ పరిస్థితులపై చర్చించి స్కూల్స్‌ ఓపెన్‌ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చినట్లు మ‌హారాష్ట్ర ఆరోగ్యశాఖ‌ మంత్రి రాజేష్‌ తెలిపారు. కాగా మొద‌ట‌ కొవిడ్ కేసులు త‌క్కువ‌గా ఉన్న ప్రాంతాల్లోనే స్కూల్స్ రీఓపెన్‌ (schools reopen) చేస్తామని చెప్పారు. ఇక కరోనా (Corona) కేసులు భారీగా పెరుగుతుండడంతో తెలంగాణ‌లో ఈ నెల 30 వరకు అన్ని విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Also Read : Stock Market today: వారాంతంలోనూ మార్కెట్లకు భారీ నష్టాలు- సెన్సెక్స్​ 427 మైనస్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News