Tamilnadu: పన్నీర్ సెల్వం వస్తే...ఆహ్వానించేందుకు సిద్ధమేనంటున్న శశికళ వర్గం

Tamilnadu: తమిళ రాజకీయాల్లో శశికళ దూకుడు పెంచబోతున్నారు. కేడర్‌లోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 24న  జయలలిత జయంతి సందర్భంగా పార్టీ ముఖ్యలతో సమావేశం కానున్నారు. వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పన్నీర్ సెల్వం గురించి కీలక ప్రకటన చేశారు.

Last Updated : Feb 21, 2021, 01:56 PM IST
Tamilnadu: పన్నీర్ సెల్వం వస్తే...ఆహ్వానించేందుకు సిద్ధమేనంటున్న శశికళ వర్గం

Tamilnadu: తమిళ రాజకీయాల్లో శశికళ దూకుడు పెంచబోతున్నారు. కేడర్‌లోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 24న  జయలలిత జయంతి సందర్భంగా పార్టీ ముఖ్యలతో సమావేశం కానున్నారు. వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పన్నీర్ సెల్వం గురించి కీలక ప్రకటన చేశారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు(Tamilnadu Assembly Elections)మరో 2-3 నెలల్లో జరగనున్నాయి. జైలు నుంచి ఇంటికి వచ్చిన తరువాత వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న శశికళ ఇక దూకుడు పెంచనున్నారు. ఈ నెల 24న జయలలిత జయంతి సందర్బంగా రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెట్టేందుకు నిర్ణయించారు. వైద్యుల సూచనల మేరకు వారం పదిరోజుల వరకూ స్వీయ నిర్బంధంలో ఉన్న శశికళ( Sasikala )ఇక కేడర్‌లో దూసుకెళ్లేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జయంతి రోజున ఇంటి వద్దే జయలలిత (Jayalalitha )చిత్ర పటానికి నివాళర్పించే శశికళ ముఖ్యులతో భేటీకి నిర్ణయించారు. వీరితోపాటు అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంకు చెందిన వారితో భేటీ కానుండడంతో ఇక రాజకీయంగా దూకుడు పెంచనున్నారని తెలుస్తోంది. అదేరోజు నగరంలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ముఖ్యమంత్రి పదవిలో తనను కూర్చోబెట్డడంలో చిన్నమ్మ పాత్ర ఏమిటనేది పన్నీర్ సెల్వం(Pannerselvam )కు బాగా తెలుసని దినకరన్ తెలిపారు. ఆయన ఒకవేళ భరతుడే అయితే చిన్నమ్మ పక్షాన నిలబడేందుకు సిద్ధమైతే ఆహ్వానించేందుకు తాము సిద్ధమేనని చెప్పారు దినకరన్. ఆయన అసంతృప్తితో ఉన్న మాట వాస్తవేమని..అయితే ఆయన వస్తానంటే, ఆదరించేందుకు చిన్నమ్మ సిద్ధమేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాము బీజేపీతో సంప్రదింపులు జరపలేదని, ఎవ్వరిపై ఓత్తిడి తీసుకు రాలేదని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. డీఎంకే(DMK) అధికారంలోకి రాకూడదన్నదే తమ లక్ష్యం అని పేర్కొన్నారు.  మరోవైపు జయలలిత జయంతి వేడుకల్ని బ్రహ్మాండంగా నిర్వహించేందుకు అన్నాడీఎంకే, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వేర్వేరుగా సిద్ధమయ్యాయి. సేవా కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించనున్నాయి. 

Also read: Love jihad: ముఖ్యమంత్రి పదవికి సిద్ధం, మనసులో మాట బయటపెట్టిన మెట్రో మ్యాన్ శ్రీధరన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - 
https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News