భవనంపై నుంచి దూకి రిటైర్డ్ ఐజీ కూతురు ఆత్మహత్య !

భవనంపై నుంచి దూకి రిటైర్డ్ ఐజీ కూతురు ఆత్మహత్య

Last Updated : Dec 9, 2018, 02:14 PM IST
భవనంపై నుంచి దూకి రిటైర్డ్ ఐజీ కూతురు ఆత్మహత్య !

పాట్నా: భవనంపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బిహార్ రాజధాని పాట్నాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఆమె తండ్రి బీహార్ పోలీస్ శాఖలో ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. రిటైర్డ్ ఐజీ కూతురు ఇలా ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన పాట్నా డీఎం, సీనియర్ ఎస్పీ.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. రిటైర్డ్ ఐజీ కూతురు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

 

Trending News