Cheap Recharge Plans: దేశంలోని టెలీకం కంపెనీల దోపిడీకు ట్రాయ్ కళ్లెం వేసింది. డేటా అవసరం లేకపోయినా అందుకు తగ్గ డబ్బులు వసూలు చేస్తూ వచ్చాయి. ఈ పరిస్థితికి ట్రాయ్ అడ్డుకట్ట వేసింది. కేవలం వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్లాన్లు అందుబాటులో తీసుకురావాలని ఆదేశించడంతో..రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఇండియా కంపెనీలు సరికొత్త ప్లాన్స్ ప్రకటించాయి.
ఇప్పటి వరకూ డేటా అవసరం లేకపోయినా డేటాతో కలిపి ఉండే ప్లాన్స్ మాత్రమే ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో అవే ప్యాక్స్ తీసుకోవాల్సి వచ్చేది. డేటా అవసరం లేనివారు కూడా డెటాకు చెల్లించాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని నివారించేందుకు ట్రాయ్ నడుం బిగించింది. డేటా అవసరం లేనివారికి కేవలం వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే అందించే ప్లాన్స్ తీసుకురావాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దాంతో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీఐ కంపెనీలు కొన్ని చౌక ప్లాన్స్ ప్రకటించాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న రీఛార్జ్ ప్లాన్స్‌లో ఇవే చాలా చౌక ప్లాన్స్.
రిలయన్స్ జియో నుంచి రెండు చౌక ప్లాన్స్ ఉన్నాయి. అందులో ఒకటి 84 రోజుల వ్యాలిడిటీతో, మరొకటి 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉన్నాయి. 458 రూపాయల రీఛార్జ్ ప్లాన్ 84 రోజులు పనిచేస్తుంది. ఇందులో వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ ఉచితం కాగా, డేటా ఏ మాత్రం ఉండదు. ఇక 365 రోజుల ప్లాన్ 1958 రూపాయలకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 3600 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి.
ఇక ఎయిర్‌టెల్ నుంచి 4 కొత్త ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో రెండు ప్లాన్స్ కేవలం ఎస్ఎంఎస్, వాయిస్ కాలింగ్ మాత్రమే అందిస్తాయి. మిగిలిన రెండు ప్లాన్స్ డేటాతో పాటు అందిస్తాయి. 548 రూపాయల ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ, 900 ఎస్ఎంఎస్‌లు, 7జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటాయి. మరో ప్లాన్ 1959 రూపాయలకు 365 రోజులుంటుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, 3600 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. ఇ 2249 రూపాయల ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, 3600 ఎస్ఎంఎస్‌లు, 30 జీబీ డేటా ఉంటాయి. అంటే డేటా అతి తక్కువగా వాడేవారికి ఇవి ఉపయోగకరం.
ఇక వోడాఫోన్ ఐడియాలో ఒకే ఒక ప్లాన్ ఉంది. ఇది 1460 రూపాయలకు 270 రోజుల వ్యాలిడిటీ ఇస్తుంది. అంటే 9 నెలలు పనిచేస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి