Reserve Bank of India: రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 8 బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల్లో అక్రమాలు వెలుగులోకి రావడంతో ఆర్బీబీ రంగంలోకి దిగింది. బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. 8 సహకార బ్యాంకుల లైసెన్సులు రద్దు చేయగా.. వాటిల్లో ముధోల కో ఆపరేటివ్ బ్యాంక్, మిలాత్ కో ఆపరేటివ్ బ్యాంక్, శ్రీ ఆనంద్ కోఆపరేటివ్ బ్యాంక్, రూపి కో ఆపరేటివ్ బ్యాంక్, దక్కన్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్, లక్ష్మీ కో ఆపరేటివ్ బ్యాంక్, సేవా వికాస్ కో ఆపరేటివ్ బ్యాంక్, బాబాజీ డేట్ ఉమెన్స్ అర్టన్ బ్యాంక్ ఉన్నాయి.
తగిన మూల ధనం అందుబాటులో లేకపోవడం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టాన్ని పాటించకపోవడం, బ్యాంకుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో ఈ 8 బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఇండియా నిర్ణయం తీసుకోంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఆదాయం తగ్గే అవకాశం ఉన్నందును లైసెన్సులను రద్దు చేసింది. అలాగే నిబంధనలను ఉల్లంఘించినందుకు మరికొన్ని బ్యాంకులకు ఆర్బీఐ భారీగా జరిమానాలు విధించింది.
సెంట్రల్ బ్యాంక్ సహా మరికొన్ని బ్యాంకులకు భారీగా జరిమానాలు విధించింది. నిబంధనలు పాటించని బ్యాంకులకు 114 సార్లు జరిమానా వేసింది. గత ఆర్ధిక సంవత్సరంలో 8 సహకార బ్యాంకుల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటికి ఫైన్ వేశారు. సహకార బ్యాంకులను బలోపేతం చేయడంపై ఆర్బీఐ దృష్టి పెట్టింది. అందులో భాగంగా సహకర బ్యాంకులపై నిఘా పెట్టింది. రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైందని గుర్తించింది. దీని వల్ల అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించింది. సహకార బ్యాంకులను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.
Also Read: Karnatka Elections 2023: కర్ణాటక ఎన్నికల వేళ భారీగా మోదీ ప్రచార సభలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.