February 2025 Bank Holidays: ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలే నడుస్తున్నాయి. చెల్లింపులు, క్యాష్ డిపాజిట్, లావాదేవీలు అంతా ఆన్‌లైన్‌లోనే. యూపీఐ అందుబాటులో వచ్చాక అసలు బ్యాంకుకు వెళ్లే పరిస్థితే తగ్గింది. అయినా ఇప్పటికీ కొన్ని పనులుంటే బ్యాంకులకు వెళ్లాల్సిందే. అందుకే బ్యాంకులకు సెలవులెప్పుడనేది చెక్ చేసుకోవాలి.
బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో తెలుసుకుంటే అందుకు తగ్గట్టుగా పనులు ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే ఆర్బీఐ ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. ఇప్పుడు ఫిబ్రవరి నెల సెలవుల జాబితా రిలీజ్ చేసింది. ఫిబ్రవరిలో అసలే పని దినాలు తక్కువ. దీనికితోడు సగం రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. ఫిబ్రవరిలో మొత్తం 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు కాగా మరి కొన్ని ప్రాంతీయ సెలవులున్నాయి.
ఫిబ్రవరి 2 ఆదివారం బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 3 సోమవారం సరస్వతీ పూజ, అగర్తలలో సెలవు
ఫిబ్రవరి 8 రెండవ శనివారం బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 9 ఆదివారం బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 11 మంగళవారం, చెన్నైలో సెలవు
ఫిబ్రవరి 12 బుధవారం శ్రీ రవిదాస్ జయంతి, షిమ్లాలో సెలవు
ఫిబ్రవరి 15 శనివారం, ఇంఫాల్‌లో సెలవు
ఫిబ్రవరి 16 ఆదివారం బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 19 బుధవారం శివాజీ జయంతి, మహారాష్ట్రలో సెలవు
ఫిబ్రవరి 20 గురువారం మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్‌లో సెలవు
ఫిబ్రవరి 22 నాలుగో శనివారం సెలవు
ఫిబ్రవరి 23 ఆదివారం సెలవు
ఫిబ్రవరి 26 మహా శివరాత్రి సెలవు
ఫిబ్రవరి 28 గ్యాంగ్‌టక్‌లో సెలవు
Also read: Mohammad Siraj vs Zanai Bhosle: టీమిండియా పేసర్ సిరాజ్ ప్రేమలో పడ్డాడా, ఎవరా ప్రేమికురాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి