Railway Employees Salary Hike: రైల్వే ఉద్యోగులకు రైల్వే మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపును ప్రకటించింది. దీంతో రైల్వే ఉద్యోగులు ప్రస్తుతం పొందుతున్న డీఏ 31 శాతం నుంచి 34 శాతానికి పెరగనుంది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోనల్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది.
రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయంతో 14 లక్షల మంది రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. పెరిగిన డీఏ ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. డీఏ పెంపుతో ఉద్యోగుల జీతాలు కూడా పెరగనున్నాయి. డీఏ పెంపుపై ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా మాట్లాడుతూ... రైల్వే మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వులు అన్ని యూనిట్లకు అందిన వెంటనే పెరిగిన డీఏను చెల్లిస్తారని... ఏప్రిల్ 30న వేతనంతో పాటు బకాయిలు కూడా అందుతాయని తెలిపారు.
కాగా, 7వ వేతన కమిషన్ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 3 శాతం పెంచిన సంగతి తెలిసిందే. కేంద్రం నిర్ణయంతో 47.68 లక్షల మంది ఉద్యోగులు, 68.62 లక్షల మంది ఫించనుదారులు లబ్ది పొందనున్నారు. డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.9వేల కోట్ల పైచిలుకు భారం పడనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook