Python in bathroom: బాత్‌రూమ్‌లోకి భారీ కొండచిలువ

న్యూ ఢిల్లీ : బాత్‌రూమ్‌లో భారీ కొండచిలువను ( Python in washroom ) చూస్తే ఎలా ఉంటుంది ? ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఢిల్లీలోని ఓఖ్లాలో ఉన్న ఒక కుటుంబానికి కూడా తాజాగా సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది.

Last Updated : Jul 22, 2020, 10:17 PM IST
Python in bathroom: బాత్‌రూమ్‌లోకి భారీ కొండచిలువ

న్యూ ఢిల్లీ : బాత్‌రూమ్‌లో భారీ కొండచిలువను ( Python in washroom ) చూస్తే ఎలా ఉంటుంది ? ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఢిల్లీలోని ఓఖ్లాలో ఉన్న ఒక కుటుంబానికి కూడా తాజాగా సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది. ఇంట్లోని బాత్‌రూమ్‌‌లోకి ప్రవేశించిన 5 అడుగుల పొడవైన కొండ చిలువను చూసి ఆ కుటుంబం భయాందోళనకు గురైంది. వెంటనే తేరుకుని వైల్డ్‌లైఫ్‌ ఎస్ఓఎస్ ( Wildlife SOS ) అనే ఎన్జీఓకు సమాచారం అందించడంతో రెస్క్యూ టీం వచ్చి బాత్రూమ్‌లో నక్కిన కొండచిలువను ప్రాణంతో బంధించి తీసుకెళ్లారు. ప్రస్తుతం కొండచిలువ కొంత అనారోగ్యంతో ఉందని.. దానిని అబ్జర్వేషన్‌లో పెట్టామని సదరు ఎన్జీఓ ( NGO ) సంస్థ ప్రతినిధులు తెలిపారు. ( Also read: COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్‌పై మరో కుట్రకు తెరతీసిన చైనా : అమెరికా )

ఢిల్లీలో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల ( Heavy rain ) కారణంగా నగరంలోని ముంపు ప్రాంతాల్లో వర్షపు నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆశ్రయం కోల్పోయిన జంతువులు, వణ్య ప్రాణులు రక్షణ కోసం ఇలా జనావాసాల్లోకి వస్తున్నట్టు వైల్డ్‌లైఫ్ ఎస్‌ఓఎస్‌కు చెందిన వసీం అక్రమ్ తెలిపారు. ( Also read: Oxford university's vaccine: కరోనావైరస్ వ్యాక్సిన్‌పై గుడ్ న్యూస్ వచ్చేసింది )

Trending News