PPF 5 Benefits: పీపీఎఫ్ పధకంలో ఇన్వెస్ట్ చేస్తే కలిగే 5 అతిపెద్ద లాభాలివే

PPF 5 Benefits: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ప్రతి ఉద్యోగి విధిగా కలిగి ఉండే పధకమిది. ఈ స్కీమ్‌లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ కారణంగా అక్కౌంట్ హోల్డర్లకు ఐదు అతి పెద్ద ప్రయోజనాలు కలగనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 20, 2025, 02:52 PM IST
PPF 5 Benefits: పీపీఎఫ్ పధకంలో ఇన్వెస్ట్ చేస్తే కలిగే 5 అతిపెద్ద లాభాలివే

PPF 5 Benefits: దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు భారీ సంఖ్యలో ఇన్వెస్ట్ చేసే పధకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇందులో రిస్క్ ఏ మాత్రం ఉండదు. దీర్ఘకాలికంగా పెట్టుబడి పెడితే చాలా లాభాలు కలుగుతాయి. ఈ పధకంలో ఆదాయం, పెట్టుబడి రెండింటి పై ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. 

పీపీఎఎఫ్ గురించి చాలామందికి తెలిసిందే. ఇదొక దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ పథకం. ప్రతి ఉద్యోగికి ఇందులో దాదాపుగా ఖాతా ఉంటుంది. ఇందులో రిస్క్ ఉండదు. లాభాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఐదు ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పథకంలో ఇన్వెస్టర్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. అంటే మీరు పెట్టే ప్రతి రూపాయి ఇందులో సురక్షితమే. దీంతోపాటు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ప్రకారం గరిష్టంగా 5 లక్షలు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఇన్‌కంటాక్స్ యాక్ట్ సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. ఏడాదికి 1.5 లక్షల వరకూ ప్రయోజనం పొందవచ్చు. ఈ పధకంపై లభించే వడ్డీ, 15 ఏళ్ల తరువాత పొందే మెచ్యూరిటీ మొత్తంపై కూడా ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. అంటే ట్యాక్స్ మినహాయింపు లభించే పధకాల్లో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. 

ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసేందుకు భారీగా పెట్టుబడి అవసరం లేదు. చిన్న చిన్న మొత్తాలతోనే పెద్దఎత్తున డబ్బులు జమ చేయవచ్చు. కేవలం 100 రూపాయలతో ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రతి ఏడాది కనిష్టంగా 500 రూపాయల నుంచి గరిష్టంగా 1.5 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్‌ను నెలకోసారి లేదా ఏడాదికోసారి పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పధకంతో రిటర్న్స్ చాలా బాగుంటాయి. వడ్డీ రేటు ఎప్పుడూ 7-8 శాతం మధ్యలో ఉంటుంది. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం ఉంది. చాలా బ్యాంకులు చెల్లించే ఎఫ్ డి వడ్డీ కంటే ఇది చాలా ఎక్కువ. 

పీపీఎఫ్ అక్కౌంట్ అనేది 15 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. ఇందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది మొత్తం విత్ డ్రా చేయడం రెండోది మరో ఐదేళ్లు పొడిగించడం. మరో ఐదేళ్లు పొడిగిస్తే మరింత ఎక్కువ ప్రయోజనం కలగనుంది. ఇది పూర్తిగా మీ ఆప్షన్ మాత్రమే. తప్పనిసరి కాదు. 

ఇక అన్నింటికీ మించి పీపీఎఫ్ అక్కౌంట్ నుంచి రుణం కూడా పొందవచ్చు. తనఖా లేదా బ్యాంకు రుణాల కంటే ఇది చాలా సులభమైన విధానం. తక్కువ వడ్డీ ఉంటుంది. సులభంగా తిరిగి చెల్లించవచ్చు. పీపీఎఫ్ అక్కౌంట్ ఓపెన్ చేసిన మూడేళ్లు తరువాత పొందవచ్చు. 

Also read: 8th Pay Commission Big Update: ఏ రాష్ట్ర ఉద్యోగుల జీతాలు పెన్షన్ ముందుగా పెరుగుతాయి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News