ప్రయాణికులకు చేదువార్త.. ఓలా, ఉబర్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి..!

నిజంగానే ఓలా, ఉబర్ లాంటి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ట్యాక్సీ, కార్లు బుక్ చేసుకొనే ప్రయాణికులకు ఇది చేదువార్త. 

Last Updated : Oct 25, 2018, 01:30 PM IST
ప్రయాణికులకు చేదువార్త.. ఓలా, ఉబర్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి..!

నిజంగానే ఓలా, ఉబర్ లాంటి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ట్యాక్సీ, కార్లు బుక్ చేసుకొనే ప్రయాణికులకు ఇది చేదువార్త. తాజాగా భారతదేశంలో క్యాబ్స్ రంగానికి సలహాదారు సంస్థగా వ్యవహరిస్తున్న రెడ్ సీర్ ప్రకటన మేరకు ఈ సారి క్యాబ్ ఛార్జీలు 15 శాతం మేరకు పెరగనున్నాయని అంటున్నారు. గత సంవత్సరమే 10 శాతం ఛార్జీలు పెంచిన సర్వీస్ ప్రొవైడర్లు.. ఈసారి 15 శాతం పెంచడానికి రంగం సిద్ధం చేయడం పట్ల పలువురు తమ విముఖతను తెలియజేస్తున్నారు.  అయితే తాజాగా ఓలాకి సంబంధించిన ఓ అధికారి ఇదే విషయంపై మాట్లాడుతూ.. నగరాన్ని బట్టి ఈ ఛార్జీలలో హెచ్చుతగ్గులు ఉంటాయని తెలిపారు.

ముఖ్యంగా ఓలా, ఉబర్ లాంటి ప్రొవైడర్లకు పనిచేస్తున్న డ్రైవర్లు గతంలో సమ్మెలకు  దిగారు. ఈ సర్వీసు ప్రొవైడర్లు అమలు చేస్తున్న పలు నిబంధనల వల్ల తాము నష్టాన్ని చవిచూస్తున్నామని వాపోయారు. అయితే ఇదే క్రమంలో డ్రైవర్లకు లాభం చేకూర్చేవిధంగా, వారికి ప్రోత్సహకాలు కూడా చేకూర్చే విధంగా ఈ సర్వీస్ ప్రొవైడర్లు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. అలాగే ప్రయాణికులను కూడా ఆకట్టుకొనేందుకు విభిన్న ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

నిర్వహణ వ్యయంతో పాటు డీజిల్, పెట్రోల్ ఛార్జీలు పెరుగుతుండడం వల్లే క్యాబ్ ఛార్జీలు పెరుగుతున్నాయని పలువురు డ్రైవర్లు అంటున్నారు. అయితే వీటి ప్రభావం ప్రయాణికులపై ఎంత వరకు పడుతుందో వేచి చూడాలి అని.. నేడు క్యాబ్స్ ద్వారా ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని.. దాదాపు రోజుకు 4 మిలియన్ల మందికి పైగానే ప్రయాణికులు క్యాబ్స్ బుక్ చేసుకుంటున్నారని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ప్రయాణికులు పెరిగే కొద్దీ నిర్వహణ వ్యయం కూడా పెరుగుతుందని అంటున్నారు. 

Trending News