దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని.. గురునానక్ జయంతి శుభాకాంక్షలు

Guru Nanak Dev Jayanti: నేడు గురునానక్ జయంతి సందర్భంగా ఆయన బోధనలను గుర్తు చేసుకున్నారు ప్రముఖులకు. ఈ పర్వ దినం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 12:43 PM IST
  • సిక్కు మత స్థాపకులు గురునానక్ జయంతి నేడు
  • దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
  • ఆయన బోధనలను గుర్తు చేసుకున్న ప్రముఖులు
దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని.. గురునానక్ జయంతి శుభాకాంక్షలు

President Kovind, PM Modi, Bollywood celebrities extended their wishes on Gurupurab: సిక్కు మత స్థాపకులు శ్రీ గురునానక్​ జయంతిని (Gurur nanak Jayanthi) పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

'గురునానక్ దేవ్ జీ జయంతి సందర్భంగా, దేశప్రజలందరికీ, ముఖ్యంగా సిక్కు సమాజానికి చెందిన సోదరులు, సోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనమందరం గురునానక్ దేవ్ జీ చెప్పిన మార్గాన్ని అనుసరిద్దామని పిలుపునిచ్చారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.

ఆయను అనుసరించి సేవ చేడయమే మా ఉద్దేశం..

గురునానక్​ మార్గంలో నడుస్తూ.. ప్రజలకు సేవ చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని మోదీ పేర్కొన్నారు. సమ్మిలిత సమాజం గురించి గురునానక్​ చూపిన దృక్పథం ఎందరికో (PM Modi wishes on Gurupurab) స్పూర్తినిచ్చిందన్నారాయన.

దాదాపు ఏడాదిన్నర తర్వాత కర్తార్​పుర్​ కారిడార్​ తెరుచుకోవడం సంతోషకర విషయం అన్నారు ప్రధాని.

Also read: గురుద్వారాలో శుక్రవారం ముస్లింల ప్రార్థనలు.. ముస్లిం సోదరులకు స్వాగతం పలికిన గురుద్వారా అసోసియేషన్

Also read: వరి వార్: కేంద్రంపై కేసీఆర్‌ ప్రశ్నల వర్షం.. కుండబద్దలు కొట్టిన సర్కార్.. ఏమన్నారంటే..??

న్యాయం, మతం, కరుణకు ప్రతీక..

సిక్కుమత వ్యవస్థాపకులు, న్యాయం, మతం, కరుణకు ప్రతీక అయిన ప్రథమ గురువు.. శ్రీ గురునానక్​ దేవ్​ జీ జన్మదినోత్సవం సందర్భంగా దేశప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.

సామాజిక సామరస్యం, సాంస్కృతిక ఐక్యత, దయా, కరుణ, అతీంద్రియ బోధనలు.. ఎల్లప్పుడూ మనకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.

Also read: కర్ణాటక రాజకీయాల్లో బిట్ కాయిన్ కుంభకోణం ప్రకంపనలు, ఆ ఇద్దరు మంత్రులే కారణమా

రాహుల్ గాంధీ ట్వీట్..

సిక్కూ మత స్థాపకులు. గురునానక్​ దేవ్​ జీకి వందనాలు. సోదరభావం, సేవ, భక్తితో కూడిన ఈ పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు! అని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాందీ ట్వీట్ చేశారు.

వీరితో పాటు బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్​ బచ్చన్​, నటి రకుల్ ప్రీత్ సింగ్ సహా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్​ సహా పలువురు ప్రముకులు కూడా గురునానక్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Also read: ప్రధాని మోదీకి రైతుల షాక్... సాగు చట్టాల ఉపసంహరణపై వారి రియాక్షన్ ఇదే...

Also read: తమిళనాడును వీడని వరణుడు.. నేడు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News