/telugu/photo-gallery/tspsc-group-4-final-result-2024-category-wise-selected-candidates-list-check-full-details-here-rn-180895 TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. 180895

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ స్కాం జరిగింది. ముంబైలోని ఒక బ్రాంచ్‌లో భారీగా మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు వర్గాలు స్పష్టం చేశాయి. బ్యాంకులో దాదాపు రూ.11,359 కోట్ల మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్టు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. కొంతమంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ముంబైలోని ఓ బ్రాంచ్‌‌లో ఈ మోసపూరిత లావాదేవీలు జరిగాయని తెలిపింది.  

ఈ డబ్బును ముంబై బ్రాంచ్ నుంచి విదేశాలకు పంపినట్టు తెలిసింది. ఈ లావాదేవీల ఆధారంగా విదేశాల్లోని ఖాతాదారుల బ్యాంకు అకౌంట్లకు నగదును పంపినట్టు బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు విచారించడం మొదలుపెట్టాయని పీఎన్‌బీ వెల్లడించింది. పారదర్శకతమైన బ్యాంకింగ్‌ సేవలు అందించేందుకే బ్యాంకు కట్టుబడి ఉందని పీఎన్‌బీ తెలిపింది. కాగా, ఈ వార్తల నేపథ్యంలో పీఎన్‌బీ బ్యాంకు షేరు ఆరు శాతం మేర క్షీణించింది.

Section: 
English Title: 
PNB uncovers over USD 1771 Million fraud at Mumbai branch
News Source: 
Home Title: 

పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ స్కాం

పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes