PM Kisan 11th Instalment: పీఎం కిసాన్ యోజన 11వ విడత నిధుల విడుదల ఎప్పుడంటే?

PM Kisan 11th Instalment: రైతులకు ఆర్థికంగా దన్నుగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్రం తీసుకొచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్​ నిధి.. 11వ విడత నిధులపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఏప్రిల్​ 1 నుంచి జూన్​ మధ్య నిధులు విడుదల చేసే అవకాశముంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2022, 05:28 PM IST
  • పీఎం కిసాన్​ 11వ దశపై కేంద్రం కసరత్తు
  • ఏప్రిల్​-జూన్​ మధ్య రైతుల ఖాతాలలో జమ
  • జనవరిలోనే 10వ విడత నిధులు జమ!
PM Kisan 11th Instalment: పీఎం కిసాన్ యోజన 11వ విడత నిధుల విడుదల ఎప్పుడంటే?

PM Kisan 11th Instalment: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం కింద 11వ విడత నిధులను త్వరలో విడుదల చేసే అవకాశముంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభమైనట్లు సమాచారం.

ప్రతీ ఆర్థిక సంవత్సరం తొలి దశ ఆర్థిక ఆర్థిక సహాయాన్ని ఏప్రిల్ 1 నుంచి జూన్ 31  మధ్య జమ చేస్తుంది కేంద్రం. జనవరిలోనే 10 విడత సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం.

ఏమిటి ఈ పథకం?

చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో ఈ పథకం పథకాన్ని తీసుకొచ్చింది కేంద్రం. ఈ పథకం ద్వారా రైతులకు రూ.6000 వేలు సహాయం అందిస్తుంది కేంద్రం. ఈ మొత్తాన్ని మూడు వాయిదాల్లో చెల్లిస్తుంది.

సాధారణంగా.. ప్రతి ఆర్థిక సంవత్సరం తొలి విడత సహాయాన్ని ఏప్రిల్​-జాన్ మధ్య, రెండవ విడతను ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 మధ్య, మూడో విడతను డిసెంబర్​ 1 నుంచి మార్చి 31 మధ్య విడుదల చేస్తుంటుంది ప్రభుత్వం.

ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందాలనుకునే వారు పీఎం కిసాన్ ఈ-కేవైసీని పూర్తి చేయడం తప్పనిసరి. ఇటీవల తెచ్చిన అప్​డేట్​ ప్రకారం.. రైతులు తమ రేషన్ కార్డ్​ వివరాలను కూడా ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పుడే రైతులు ప్రభుత్వం నుంచి సహాయం పొందగలుగుతారని వెల్లడించింది.

Also read: Bhagwant Mann: పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం..

Also read: Navjot Singh Sidhu: సోనియా ఆదేశాలతో పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడిగా తప్పుకున్న సిద్ధూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News