PF ATM Withdrawal: ఈపీఎఫ్ సంస్థ కస్టమర్ల ప్రయోజనం, సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తుంటుంది. ఇప్పుడు అదే విధంగా కొత్త మార్పులు చేసింది. ఇక నుంచి పీఎఫ్ డబ్బులు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవడమే కాకుండా కొత్త యాప్ కూడా అందుబాటులో రానుంది.
ఈపీఎఫ్ఓ కస్టమర్లకు శుభవార్త అందిస్తోంది. ఈ ఏడాది జూన్ నుంచి పీఎఫ్ కొత్త విధానంలో అమల్లోకి రానుంది. ఈ కొత్త విధానంలో భాగంగా కొత్త యాప్ సౌకర్యం ఉంటుంది. దాంతో పాటు ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కలుగుతుది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూఖ్ మాండవియా ఈపీఎఫ్ఓ 3.0 ను ఇటీవలే లాంచ్ చేశారు. ఉద్యోగులకు ఇది మరింత మెరుగైందిగా ఉంటుంది. ఈపీఎఫ్ఓ 3.0 ప్రకారం పీఎఫ్ సభ్యులందరికీ ఏటీఎం కార్డులు జారీ అవుతాయి. సభ్యులు తమ పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి సులభంగా ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ నెలలో వెబ్‌సైట్‌లో అందుకు అనుగుణంగా మార్పులు కన్పించవచ్చు. ఈపీఎఫ్ఓ 3.0 దశలవారీగా అమలవుతుంది.
ఏటీఎం నుంచి పీఎఫ్ విత్‌డ్రా
పీఎఫ్ సభ్యులంతా ఇకపై తమ పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బుల్ని ఏటీఎం ద్వారా డ్రా చేసుకోవచ్చు. ఏ అధికారి లేదా సిబ్బంది ఆమోదంతో పని లేకుండానే కస్టమర్లు తమ ఎక్కౌంట్ నుంచి డబ్బులు పొందవచ్చు. ఈపీఎఫ్ఓ 3.0 ప్రకారం కొత్త యాప్, డిజిటల్ సేవలు లాంచ్ కానున్నాయి. కొత్త యాప్, ఏటీఎం కార్డ్ జూన్ 2025లో ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో 12 శాతం విధిగా జమ చేయాలనే నిబంధనను తొలగించే అవకాశాలున్నాయి. పీఎఫ్ ఎక్కౌంట్‌లో ఎంత సేవ్ చేయాలనేది సదరు ఉద్యోగికి ఆప్షన్ ఉండవచ్చు.
పీఎఫ్ సేవల్ని సులభతరం చేసేందుకు, వేగంగా, పారదర్శకంగా మార్చే ఉద్దేశ్యంతో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించుకుని ఈపీఎఫ్ఓ 3.0 లాంచ్ అయింది. తద్వారా పీఎఫ్ కస్టమర్లు, ఉద్యోగులకు మరింత మెరుగైన సేవలు లభించనున్నాయి.
Also read: NEET UG 2025 Exam Pattern: నీట్ యూజీ 2025 పరీక్ష విధానంలో కీలక మార్పు, ఇక అదనపు ప్రశ్నలు, సమయం ఉండదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి