Petrol prices in Tamilnadu: మూడు రూపాయలు తగ్గనున్న పెట్రోల్ ధరలు

Petrol prices in Tamilnadu: న్యూ ఢిల్లీ: పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఒక్కసారిగా లీటర్ పెట్రోల్ ధర మూడు రూపాయలు తగ్గిందని తెలిస్తే అవాక్కవడం ఖాయం. ప్రస్తుత పరిస్థితి అలాంటిదే మరి. తమిళనాడు ప్రజలకు తాజాగా అటువంటి పరిస్థితే ఎదురైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2021, 07:20 PM IST
Petrol prices in Tamilnadu: మూడు రూపాయలు తగ్గనున్న పెట్రోల్ ధరలు

Petrol prices in Tamilnadu: న్యూ ఢిల్లీ: పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఒక్కసారిగా లీటర్ పెట్రోల్ ధర మూడు రూపాయలు తగ్గిందని తెలిస్తే అవాక్కవడం ఖాయం. ప్రస్తుత పరిస్థితి అలాంటిదే మరి. తమిళనాడు ప్రజలకు తాజాగా అటువంటి పరిస్థితే ఎదురైంది. ప్రజలపై పెరుగుతున్న పెట్రోల్ ధరలు (Petrol, diesel prices today) భారం తగ్గించేందుకు తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 

ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 105 దాటింది. పెట్రోల్ ధరలు పెరగడానికి అంతర్జాయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం ఒక కారణమైతే... కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు భారీ మొత్తంలో విధిస్తున్న పన్నులు మరో కారణం అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గడం కోసం ప్రభుత్వాలు విధించే పన్నులు కొంతమేరకు తగ్గించుకోవాలనే డిమాండ్ ఎప్పుడూ వినిపించేదే. ఆ డిమాండ్‌కి అనుగుణంగా లీటర్ పెట్రోల్ ధరలు 3 రూపాయల మేర తగ్గేలా పన్నులు తగ్గిస్తూ తమిళనాడు సర్కార్ (Petrol prices in Tamil Nadu) నిర్ణయం తీసుకుంది. 

Also read : 7th Pay Commission: బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. DA hike తో పెరగనున్న శాలరీ

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. లీటరు పెట్రోలుపై రూ.3 ధర తగ్గిస్తున్నట్టు స్పష్టంచేసిన మంత్రి పళనివేల్ త్యాగరాజన్.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా తమిళనాడు రాష్ట్ర ఖజానాకు రూ. 1,160 కోట్ల భారం పడుతుందని అన్నారు. తమిళనాడు బడ్జెట్ 2021 (Tamil Nadu budget 2021) ప్రవేశపెడుతున్న సందర్భంగా త్యాగరాజన్ ఈ వివరాలు వెల్లడించారు.

తమిళనాడులో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.102.49 గా ఉంది. తమిళనాడు సర్కార్ (Tamil Nadu govt) తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక లీటర్ పెట్రోల్ ధర మూడు రూపాయల మేర తగ్గనుంది. ఆగస్టు 14వ తేదీ నుంచే తగ్గిన పెట్రోల్ ధరలు (Petrol prices) అమలులోకి వస్తాయని పళనివేళ్ త్యాగరాజన్ తెలిపారు.

Also read : EPFO: ఈపీఎఫ్ సభ్యులకు కీలక సూచన, ఈ నామినేషన్ దాఖలు చేయకపోతే డబ్బులు పోయినట్టే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News