/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Hardik Patel: హార్దిక్ పటేల్‌ పేరు తెలియని వారుండరు. పాటిదార్ ఉద్యమంతో ఫేమస్‌ అయ్యారు. ఆ తర్వాత పాటిదార్ నేతగా కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ రాష్ట్ర యూనిట్‌లో కీలక పదవిలో కొనసాగారు. తాజాగా తాను కొత్త రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టనున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలింది.

హార్దిక్ పటేల్..ఇవాళ బీజేపీలో చేరనున్నారు. దేశ, రాష్ట్ర, ప్రజా ప్రయోజనాల కోసం నేటి నుంచి కొత్త రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం కోసం సైనికుడిగా పనిచేస్తానని వెల్లడించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. దీంతో బీజేపీలో హార్దిక్ పటేల్ చేరికపై క్లారిటీ వచ్చింది. అంతకముందు అహ్మదాబాద్‌లోని నివాసంలో పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

2019 సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో హార్దిక్ పటేల్ చేరారు.  ఐతే గతకొంతకాలంగా కాంగ్రెస్‌పై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి ఆ పార్టీని హార్దిక్ పటేల్ వీడబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈక్రమంలోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌ నేతల తీరును లేఖలో వివరించారు.

గుజరాత్‌పై కాంగ్రెస్ అధిష్టానికి అంత ఆసక్తిగా లేదని..ప్రజలోకి వెళ్లేందుకు ఆ పార్టీకి సరైన రోడ్‌ మ్యాప్‌ లేదని విమర్శలు గుప్పించారు. అందుకే వరుస ఓటములు వస్తున్నాయని తెలిపారు. మరోవైపు క్రమంగా బీజేపీకి దగ్గర అవుతూ వస్తున్నారు. అయోధ్య తీర్పు, ఆర్టిక్ 370 రద్దు సమయంలోనూ ఆ పార్టీకి అనుకులంగా వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచే బీజేపీలో చేరుతారంటూ ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. 

Also read:India Corona: దేశంలో మరో వేవ్‌ రాబోతోందా..ఇవాళ కేసుల సంఖ్య ఎంతంటే..!

Also read:Telangana Formation Day: ఢిల్లీలో తెలంగాణ సంబురం..పాల్గొననున్న అమిత్ షా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Section: 
English Title: 
patidar leader hardik patel will join bjp today
News Source: 
Home Title: 

Hardik Patel: ప్రధాని మోదీ కోసం సైనికుడిగా పనిచేస్తా..నేడు బీజేపీలోకి హార్దిక్ పటేల్..!

Hardik Patel: ప్రధాని మోదీ కోసం సైనికుడిగా పనిచేస్తా..నేడు బీజేపీలోకి హార్దిక్ పటేల్..!
Caption: 
patidar leader hardik patel will join bjp today(file)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

బీజేపీలోకి హార్దిక్ పటేల్‌

కొత్త రాజకీయ జీవితం మొదలు 

దేశం కోసం సైనికుడిగా పనిచేస్తా:హార్దిక్ పటేల్‌

Mobile Title: 
Hardik Patel: ప్రధాని మోదీ కోసం సైనికుడిగా పనిచేస్తా..నేడు బీజేపీలోకి హార్దిక్ పటేల్
Alla Swamy
Publish Later: 
No
Publish At: 
Thursday, June 2, 2022 - 13:12
Request Count: 
113
Is Breaking News: 
No