భారీ వర్షాలు, విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్ 19 నుంచి 21 తేదీలలో నిర్వహించాల్సిన పరీక్షలు (OU Exams 2020 Postponed) వాయిదా పడ్డాయి. వీటి వల్ల అక్టోబర్ 22 నుంచి జరిగే పరీక్షలకు ఏ ఇబ్బంది లేదని.. యథాతథంగా నిర్వహించనున్నట్లు ఓయూ (Osmania University) పరీక్షల నియంత్రణ అధికారి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
బంగాళాఖాతాలో వాయుగుండం, అల్పపీడనం కారణంగా తెలంగాణలో మరో 3 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో పలు యూనివర్సిటీలు పరీక్షలను వాయిదావేశాయి. అయితే ప్రస్తుతం వాయిదా వేసిన పరీక్షలపై ఆందోళన అక్కర్లేదని, వాటి తేదీలను త్వరలోనే ఖరారు చేస్తామని ఓయూ (OU) పరీక్షల అధికారి చెప్పారు.
కాగా, భారీ వర్షాలు, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో అక్టోబర్ 14, 14 తేదీలలో సైతం ఓయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయడం తెలిసిందే. తాజాగా మరోసారి అక్టోబర్ 19 నుంచి 21 వరకు మూడు రోజులపాటు నిర్వహించాల్సిన పరీక్షలను ఉస్మానియా యూనివర్సీటీ కీలక నిర్ణయం తీసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
నేటి నుంచి 21 వరకు ఓయూ పరీక్షలు వాయిదా
గత వారం రోజులుగా భారీ వర్షాలు, విపత్కర పరిస్థితులు
అక్టోబర్ 19 నుంచి 21 వరకు ఓయూ పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రకటన
అక్టోబర్ 22 నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం