Modi - Nitish: బిహార్ సభలో అందరు చూస్తుండగానే నితీష్ చేసిన పనికి అవాక్కయిన ప్రధాని మోడీ..

Modi - Nitish: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రదేశ్ లో  తెలుగు దేశం, బిహార్ లోని నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ మద్ధతు నిస్తున్నాయి.  అయితే మధ్యలో కొన్నేళ్లు ఉప్పు నిప్పుగా ఈ మూడు పార్టీలు .. ఇపుడు పప్పులో ఉప్పులా కలిసి పోయాయి. అంతేకాదు ఒకే ఎజెండాతో ముందుకు సాగుతున్నాయి. తాజాగా బిహార్ లో జరిగిన ఓ సభలో నితీష్  కుమార్ చేసిన పనికి ప్రధాని నరేంద్ర మోడీ అవాక్కయ్యేలా చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 14, 2024, 07:37 AM IST
Modi - Nitish: బిహార్ సభలో అందరు చూస్తుండగానే నితీష్ చేసిన పనికి అవాక్కయిన ప్రధాని మోడీ..

Modi - Nitish: ప్రస్తుతం ప్రధాన మంత్రి.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నెల 20న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జార్ఖండ్ లో నిన్ననే తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. మరోవైపు ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలుబడనున్నాయి. ఇంత బిజీలో కూడా   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిహార్ లో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ఓ సంభలో ప్రధాని మోడీ కాళ్లు మొక్కబోయారు బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌. ఈ అనూహ్య పరిణామం బీహార్‌లోని దర్భంగాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో చోటుచేసుకుంది.  ఒక్కసారిగా ఈ దృశ్యాలు చూసిన అక్కడివారంతా అవాక్కయ్యారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీపాదాలు మొక్కేందుకు ప్రయత్నించిన నితీశ్‌ కుమార్‌ను మోడీ నిలువరించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter

మోదీ పాదాలకు నీతీశ్‌ నమస్కరించేందుకు ప్రయత్నించడం ఈ ఇయర్ర లో ఇది మూడోసారి కావడం గమనార్హం. జూన్‌లో పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ప్రధానిని కలిసిన సందర్భంలోనూ ఆయన  పాదాలను తాకేందుకు నితీశ్‌ కుమార్ ప్రయత్నించారు. అంతకుముందు లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ నవాదాలో నిర్వహించిన ఓ ప్రచార సభలోనూ ప్రధాని పాదాలను తాకారు. వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ఆయన పాదాలను సృజించారు.

బిహార్‌లోని దర్భంగాలో ఎయిమ్స్‌కు శంకుస్థాపనతోపాటు 12వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. నీతీశ్‌ కుమార్‌పై ప్రశంసలు కురిపించారు. జంగిల్‌ రాజ్‌ నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకువచ్చారని కొనియాడారు.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News