Nitish 9.O: ఇది నితీశ్ 9.O వర్షన్‌.. మరోసారి బిహార్‌ సీఎంగా ప్రమాణం.. మంత్రివర్గం ఇదే

Bihar Politics: బిహార్‌లో మరోసారి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మహాఘట్‌బంధన్‌ కూలిపోయి మరో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అరుదైన ఘనత నెలకొల్పారు. మంత్రివర్గంలో మూడు పార్టీలతో;పాటు ఒక స్వతంత్రుడికి అవకాశం లభించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 28, 2024, 06:50 PM IST
Nitish 9.O: ఇది నితీశ్ 9.O వర్షన్‌.. మరోసారి బిహార్‌ సీఎంగా ప్రమాణం.. మంత్రివర్గం ఇదే

Nitish Oath: కొన్నాళ్ల నుంచి కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు ఆదివారం కీలక ఘట్టానికి చేరుకున్నాయి. బిహార్‌ ముఖ్యమంత్రిగా ఉదయం రాజీనామా చేసిన నితీశ్ కుమార్‌ కొన్ని గంటల్లోనే సాయంత్రం కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం విశేషం. ఆయన తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేట్టారు. పట్నాలోని రాజ్‌ భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌ ప్రమాణం చేయించారు. 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సామ్రాట్‌ చౌదరి, విజయ్‌ కుమార్‌ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా నియమితులయ్యారు. కొత్త మంత్రివర్గంలో జేడీయూ, బీజేపీ నుంచి ముగ్గురు చొప్పున, హిందూస్థాన్‌ ఆవామ్‌ మోర్చ (సెక్యులర్‌) నుంచి ఒకరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేకు చోటు దక్కింది.

ఇండియా కూటమిపై నితీశ్ స్పందన
ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిపి ఏర్పడిన మహాఘట్‌బంధన్‌ నుంచి వైదొలిగిన నితీశ్ కుమార్‌ తాజాగా బీజేపీ, ఎల్‌జేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ తదితరులు హాజరయ్యారు. ప్రమాణం అనంతరం నితీశ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ప్రస్తుతానికి నేను అనవసర వ్యాఖ్యలు ఏమీ చేయను. మహాఘట్‌ బంధన్‌లో చాలా సమస్యలు ఉన్నాయి. ఏదీ సక్రమంగా లేదు. ఈ విషయంలో చాలా మంది నాయకులు నన్ను ప్రశ్నించారు. సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. వారి అభిప్రాయాలన్నీ తీసుకున్నా తర్వాతే నేను రాజీనామా చేశాను' అని నితీశ్‌ కుమార్‌ తెలిపారు.

మంత్రులు వీరే..

జేడీయూ నుంచి 
బిజేంద్ర ప్రసాద్‌ యాదవ్‌, శ్రవణ్‌ కుమార్‌, విజయ్‌ కుమార్‌

బీజేపీ నుంచి 
విజయ్‌ సిన్హా, ప్రేమ్‌ కుమార్‌, సామ్రాట్‌ చౌదరి

హిందూస్థాన్‌ ఆవామ్‌ మోర్చ (సెక్యులర్‌) నుంచి సంతోష్‌ కుమార్‌ సుమన్‌
స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్‌ కుమార్‌ సింగ్‌

అసెంబ్లీలో బలబలాలు
మొత్తం అసెంబ్లీ స్థానాలు 243 ఉండగా మెజారిటీకి కావాల్సిన బలం 122.
ప్రస్తుత ప్రభుత్వానికి 124 సీట్లు ఉన్నాయి.
బీజేపీ - 78
జేడీయూ - 45
స్వతంత్ర ఎమ్మెల్యే -1

ఇతర పార్టీల బలం
ఆర్‌జేడీ - 79
కాంగ్రెస్ - 19
ఎంఐఎం -1 
కమ్యూనిస్టు పార్టీ - 16
హెచ్‌ఏఎం (ఎస్‌) - 4 
స్వతంత్ర ఎమ్మెల్యే -1

 

Also Read: Seethakka: కేటీఆర్‌ పెంపుడు కుక్కల కోసం రూ.12 లక్షలా? మంత్రి సీతక్క విస్మయం

Also Read: Lavanya Tripathi: విశాఖ బీచ్‌లో చెత్తాచెదారం ఏరివేసిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News