చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్: 3 కోట్ల మందికి పెన్షన్ స్కీమ్

చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్: 3 కోట్ల మందికి పెన్షన్ పథకం

Last Updated : Jul 5, 2019, 12:54 PM IST
చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్: 3 కోట్ల మందికి పెన్షన్ స్కీమ్

హైద‌రాబాద్‌: దేశంలోని చిరు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. వార్షిక ట‌ర్నోవ‌ర్ రూ.1.5 కోట్ల క‌న్నా త‌క్కువ ఉన్న రిటేల్ వ్యాపారులకు ప్రధాన మంత్రి కరమ్ యోగి మాన్ ధన్ పథకం కింద పెన్ష‌న్ అందించనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సుమారు మూడు కోట్ల రీటేల్ వ్యాపారుల‌కు ఈ పెన్ష‌న్ ప‌థ‌కం కింద లబ్ధి చేకూర్చనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి స్పష్టంచేశారు. నేడు లోక్‌స‌భ‌లో కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సందర్భంగా ఆమె ఈ ప్రకటన చేశారు. 

వస్తు, సేవల పన్ను కింద తమ పేరు నమోదు చేసుకున్న‌ మ‌ధ్య‌శ్రేణి సంస్థ‌ల‌కు 2% వ‌డ్డీతో రుణాలు అందించి వారిని ప్రోత్సహించనున్న‌ట్లు మంత్రి తెలిపారు. అందుకోసం కోసం సుమారు రూ. 350 కోట్లు కేటాయించిన‌ట్లు ఆమె బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇది ఒక రకంగా జీఎస్టి నిబంధనలకులోబడి వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులకు కలిసొచ్చే అంశం కానుంది.

Trending News