Netaji statue: ఇండియాగేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్​ విగ్రహం ఆవిష్కరణ

Netaji statue: ఇండియాగేట్ వద్ద నేతాజీ సుభాష్​ చంద్ర బోస్​ హోలో గ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోదీ. గ్రానైట్​తో ఏర్పాటు చేసిన పూర్తి స్థాయి విగ్రహాన్ని ఇక్క తర్వాత స్థాపించనున్నారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2022, 11:02 PM IST
  • ఇండియా గేట్​ వద్ద నేతాజీ హోలో గ్రామ్ విగ్రహం ఏర్పాటు
  • పూర్తి స్థాయి గ్రానైట్ విగ్రహం పెట్టే వరకు అందుబాటు
  • భవిష్యత్ తరాలకు స్పూర్తిగా నిలుస్తుందని ప్రధాని వెల్లడి
Netaji statue: ఇండియాగేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్​ విగ్రహం ఆవిష్కరణ

Netaji statue: స్వాతంత్ర్య పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి (జనవరి 23) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా గేట్ వద్ద ఆయన హోలో గ్రామ్​ విగ్రహాన్ని (Netaji hologram statue) ఆవిష్కరించారు.

ఈ హోలో గ్రామ్​ (బీమ్​ లైట్లతో ఏర్పాటు చేసే 3డీ ఇమేజ్​) ఆవిష్కరణ (What is hologram statue) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా.. కేంద్ర మంత్రులు అమిత్​షా, హర్దీప్​సింగ్ పూరీలు నేతాజీకి ఘన నివాళులర్పించారు.

ఈ విగ్రహం 28 అడుగుల ఎత్తు, 7.5 అడుగుల వెడల్పు ఉంటుంది. 30 వేల ల్యూమెన్స్​ స్థాయి ప్రకాశవంతమైన 4కే ప్రొజెక్టర్​ ద్వారా ఈ విగ్రహం (Netaji hologram statue details) కనిపిస్తుంది. 

ఇవే కొలతలతో.. ఈ హోలో గ్రామ్​ విగ్రహం స్థానంలో గ్రానైట్​తో చేసిన పూర్తి స్థాయి విగ్రహం ఏర్పాటు (Netaji statue at India gate) చేయనున్నారు.

గ్రానైట్​ విగ్రహం ఏర్పాటు చేసే వరకు.. ఈ హోలోగ్రామ్​ విగ్రహం అక్కడ ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ విగ్రహం ప్రజస్వామ్య విలువలను చాటి చెప్పడం సహా భావి తరాలకు స్పూర్తిగా నిలుస్తుందని (PM Modi on Netaji statue) వివరించారు.

ఈ సందర్భంగా నేతాజీ సేవలను, ఆయన చూపిన స్వాతంత్ర్య  పోరాట తెగువను గుర్తు చేసుకున్నారు ప్రధాని. పోరాడి స్వతంత్ర్యం తెచ్చుకోవాలనే ఆయన ఎప్పుడు భావించినట్లు తెలిపారు. బ్రిటీషర్లకు తల వంచడాన్ని ఆయన తిరస్కరించే వారని మోదీ చెప్పుకొచ్చారు.

Also read: Punjab Elections: మా మంత్రిని త్వరలో ఈడీ అరెస్ట్​ చేస్తుంది: అరవింద్ కేజ్రివాల్​

Also read: Arunachal Missing Boy: ఎట్టకేలకు అతని ఆచూకీ లభ్యం.. భారత్‌కు అప్పగిస్తామన్న చైనా ఆర్మీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News