NEET UG 2025: నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకల నేపధ్యంలో సుప్రీంకోర్టు నియమించిన ఇస్రో మాజీ ఛీఫ్ కే రాధాకృష్ణన్ కమిటీ నీట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రతిపాదించినా ప్రభుత్వం మాత్రం ఆఫ్‌లైన్ విధానానికే మొగ్గుచూపడం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలున్నాయని తెలుస్తోంది. అవేంటో పరిశీలిద్దాం.
గత ఏడాది నీట్ యూజీ 2024 పరీక్షలో భారీ అక్రమాలు వెలుగుచూసినా కేంద్ర ప్రభుత్వం మరోసారి నీట్ పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలోనే అంటే పెన్ పేపర్ విధానంలోనే నిర్వహించేందుకు నిర్ణయించింది. వాస్తవానికి కే రాధాకృష్ణన్ కమిటీ నీట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని సూచించింది. కానీ ప్రభుత్వం ఈసారి పాత విధానానికే ఆసక్తి చూపించింది. నీట్ పరీక్షను మరోసారి పెన్ అండే పేపర్ విధానంలోనే నిర్వహించనుంది. ఇదే విషయాన్ని ఎన్టీఏ ప్రకటించింది.
ఆన్‌లైన్ విధానానికి ప్రభుత్వం ఎందుకు నో చెప్పింది
నీట్ యూజీ పరీక్ష నేది దేశంలోనే అతి పెద్ద పరీక్ష. గత ఏడాది ఈ పరీక్షకు ఏకంగా 24 లక్షలమంది హాజరయ్యారు. అందులోనూ గ్రామీణ ప్రాంతాల్నించి పెద్ద సంఖ్యలో విద్యార్ధులు హాజరయ్యారు. ఈ ఏడాది 28-30 లక్షలమంది హాజరుకావచ్చని అంచనా. ఇంతమందికి ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాలంటే మౌళిక సదుపాయాల కల్పన చాలా కష్టమౌతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఒకేసారి ఆన్‌లైన్ విధానంలో 1.5 లక్షలమందికే వీలుంటుంది. 30 లక్షలమంది పరీక్షలు రాస్తే 10 సార్లు పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. అంటే పరీక్ష పేపర్ల పెట్స్ 10-12 సిద్ధం చేసుకోవాలి. ఇది అంత సులభమైంది కాదు. అవే ప్రశ్నలు రిపీట్ కావచ్చు. కొందరికి పరీక్ష సులభమౌతుంది. మరి కొందరికి కష్టంగా ఉండవచ్చు. ఒకే విధమైన పరీక్ష పత్రం ఉండదు. మౌళిక సదుపాయాల కల్పన అన్నింటికంటే అతి పెద్ద సమస్యగా మారనుంది. అందుకే ప్రభుత్వం ఈసారి కూడా ఆఫ్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమైంది.
పెన్ అండ్ పేపర్ విధానం ఎంచుకోడానికి మరో కారణం పెద్ద ఎత్తున విద్యార్ధులు గ్రామీణ ప్రాంతాల నుంచి ఉండటం. పరీక్షకు కేవలం మూడు నెలల ముందు ఆన్ లైన్ అంటే గ్రామీణ విద్యార్ధులకు పట్టు ఉండదు. పట్టణ ప్రాంత విద్యార్ధులకు ఆన్‌లైన్ పరీక్ష అలవాటున్నట్టుగా గ్రామీణ విద్యార్ధులకు ఉండదు. అందుకే మరో ఏడాది ఇదే ఆఫ్‌లైన్ విధానం కొనసాగనుంది. అయితే భవిష్యత్తులో మాత్రం నీట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి పరీక్ష విధానంలో మార్పు ఉంటే విద్యార్ధులకు ముందస్తుగా సమాచారం అందిస్తారు.
Also read: NEET UG 2025 Exam: నీట్ యూజీ 2025 పరీక్షపై క్లారిటీ, ఈసారి పరీక్ష జరిగే విధానమిదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook