Me Too: పంజాబ్ కొత్త సీఎంకు మీటూ సెగ...చరణ్‌జీత్‌ను తొలగించాలని రేఖా శర్మ విజ్ఞప్తి..

Charanjit Singh Channi: అనూహ్య పరిణామాల మధ్య పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన చరణ్‌జిత్ సింగ్ చన్నీకు మీ టూ సెగ తాకింది. మీటూ ఆరోపణలొచ్చిన  చన్నీని సీఎంగా ఎంపిక చేయడంపై జాతీయ మహిళా కమిషన్  ఛైర్‌పర్సన్  రేఖా శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవికి ఆయన అనర్హుడని, ఆయనను తొలగించాలని  సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 20, 2021, 09:44 PM IST
  • పంజాబ్ కొత్త సీఎంకు మీటూ సెగ
  • చరణ్‌జీత్‌ నియామకంపై రేఖా శర్మ అభ్యంతరం
  • తొలగించాలని సోనియా గాంధీకి విజ్ఞప్తి
Me Too: పంజాబ్ కొత్త సీఎంకు మీటూ సెగ...చరణ్‌జీత్‌ను తొలగించాలని రేఖా శర్మ విజ్ఞప్తి..

Me Too: పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చరణ్‌జిత్ సింగ్ చన్నీకు మీటూ సెగ తాకింది. 2018లో మంత్రిగా ఉన్న సమయంలో ఓ లేడీ ఐఏఎస్‌కు అసభ్యకరమైన మెసేజ్‌ పంపారని చరణ్‌జీత్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆ మహిళా అధికారి పంజాబ్‌ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. కాని పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయలేదు. లేడీ ఐఏఎస్‌కు అప్పట్లో చరణ్‌జీత్‌(Charanjit Singh Channi) సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగిందని భావించారు. తాను దళితుడిని కాబటే టార్గెట్‌ చేశారని మీటూ ఆరోపణలపై కౌంటర్‌ ఇచ్చారు చరణ్‌జీత్‌. మీటూ ఆరోపణలొచ్చిన చన్నీని సీఎంగా ఎంపిక చేయడంపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ(Rekha Sharma) అభ్యంతరం వ్యక్తం చేశారు.

సీఎంగా ఆయన్ను తొలగించండి: రేఖా శర్మ
ముఖ్యమంత్రి పదవికి ఆయన అనర్హుడని, ఆయనను తొలగించాలని సోనియా గాంధీ(Sonia Gandhi)కి విజ్ఞప్తి చేశారు. 2018 లో చన్నీపై వచ్చిన మీటూ(Me Too) ఆరోపణలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిందని రేఖా శర్మ గుర్తు చేశారు. . దీనిపై ఆందోళన చేసినా చర్యలేవీ లేకపోగా, తాజాగా అలాంటి వ్యక్తిని సీఎంగా ఎంపిక చేయడం శోచనీయమన్నారు. ఒక మహిళ సోనియా గాంధీ నేతృత్వంలోని పార్టీలో ఈ పరిణామం తీవ్ర ద్రోహమన్నారు.

ఈ చర్య మహిళల భద్రతకు ముప్పు అని రేశాఖర్మ వ్యాఖ్యానించారు. దీనిపై సమగ్రవిచారణ జరిపి,  బాధిత మహిళ స్టేట్‌మెట్‌ను పరగణనలోకి తీసుకుని, చన్నీపై చర్యలు తీసుకోవాలని ఆమె సోనియాను కోరారు. పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్‌మధ్య మధ్య నెలరోజుల పాటు సాగిన ఆధిపత్య పోరుకు చరణ్‌జీత్‌ను సీఎం చేసి చెక్‌ పెట్టింది కాంగ్రెస్‌(Congress) హైకమాండ్‌. పంజాబ్‌ తొలి దళిత సీఎంగా ఆయన చరిత్ర సృష్టించారు. అయితే మీటూ ఆరోపణలు మాత్రం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News