శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇటీవలే ఇచ్చిన తీర్పుపై పలువురు భక్తులతో పాటు మహిళలు నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తీర్పును సవాల్ చేస్తూ సోమవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది. సుప్రీం కోర్టు తీర్పును పునః పరిశీలించాలని జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది.
అటు మరోవైపు కేరళలో అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై అభ్యంతరాలు కొనసాగుతున్నాయి. ఈ తీర్పు శబరిమల ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని పూజారులు, భక్తులు పేర్కొన్నారు. ప్రజల మనోభావాలు, అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలంటూ కేరళ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు అక్కడి ప్రజలు. కేరళలోని కొన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు కోర్టు తీర్పును వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసన, ర్యాలీల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించిన కేరళ ప్రభుత్వం.. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసేదిలేదంటూ ప్రకటించారు. తమ ప్రభుత్వం శబరిమల సందర్శించే మహిళలకు సౌకర్యాలు, రక్షణ కల్పిస్తుందని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
అయితే తదనంతరం జరిగిన ఆందోళనల నేపథ్యంలో ప్రజాభిప్రాయం సేకరించాలని విజయన్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే చర్చలకు ఆహ్వానించగా.. ఆలయ ప్రధాన పూజారులు అందుకు తిరస్కరించారు. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే, ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు.
కొట్టాయంలో శబరిమల ప్రధాన పూజారి కే రాజీవరు మాట్లాడుతూ సంప్రదాయాలు, సంస్కృతులను పరిరక్షించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఉమ్మడిగా ఉద్యమించాలన్నారు.
Supreme Court verdict over women's entry in Kerala's #SabarimalaTemple: National Ayyappa Devotee association files a review petition in the Supreme Court challenging the earlier verdict of the Court.
— ANI (@ANI) October 8, 2018