రాష్ట్రపతి నిర్ణయంపై ఫిలిం ఇండస్ట్రీ అసంతృప్తి..!

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీసుకున్న నిర్ణయం ఒకటి ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అదేమిటంటే.. గురువారం సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతోంది.

Last Updated : May 3, 2018, 06:55 PM IST
రాష్ట్రపతి నిర్ణయంపై ఫిలిం ఇండస్ట్రీ అసంతృప్తి..!

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీసుకున్న నిర్ణయం ఒకటి ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అదేమిటంటే.. గురువారం సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతోంది. సాంప్రదాయం ప్రకారం.. ఈ పురస్కారాలను, అవార్డు గ్రహీతలు అందరికీ భారత రాష్ట్రపతి స్వయంగా అందివ్వాలి. 

ఈ క్రమంలో ఈ రోజే జరిగే అవార్డుల వేడుకకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.  కానీ, ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి కోవింద్ కేవలం గంట సమయం మాత్రమే కేటాయించారు. ఈ గంట సమయంలో ఆయన కేవలం 11 మందికి మాత్రమే అవార్డులను అందిస్తానని తెలిపినట్లు సమాచారం. మిగితా వారికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పురస్కారాలను అందిస్తారు. మొత్తం 140 మంది అవార్డు విజేతలు ఉండగా.. వారిలో కొంతమందికి మాత్రమే రాష్ట్రపతి అవార్డులు ఇస్తే.. మిగితా వారు నొచ్చుకొనే అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి

కాగా.. అవార్డు విజేతలు చాలా మంది రాష్ట్రపతి నిర్ణయంతో అసంతృప్తిని తెలియజేశారు. కొందరు అవార్డుల వేడుకను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. గత ఏడాది జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజేతలందరికీ అవార్డులను అందజేసినట్లు గుర్తుచేశారు. విజేతలకి అవార్డులను అందజేయడానికి కోవింద్‌కు వచ్చిన అభ్యంతరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ నిర్ణయాన్ని సినీ ప‌రిశ్రమ కూడా త‌ప్పు ప‌ట్టింది.

Trending News