National Sports Awards 2021: రాష్ట్రపతి భవన్ లో నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ వేడుక (National Sports Awards 2021) శనివారం ఘనంగా జరిగింది. క్రీడల్లో ఉత్తమ ప్రదర్శన కనబరచిన 12 మంది అథ్లెట్లకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న (Major Dhyan Chand Khel Ratna Award) అవార్డును అందజేశారు.
Happy Diwali: దేశప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి అందరికి మేలు చేయాలని ఆంకాక్షించారు.
President Ram Nath Kovind AP Tour: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గత కొన్ని రోజులుగా దక్షిణాది రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు రామ్‌నాథ్ కోవింద్ విచ్చేయనున్నారు. పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా నూతన సంవత్సర (New year 2021) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనే నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టినరోజు (President Ram Nath Kovind Birthday) నేడు (అక్టోబర్ 1). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి కోవింద్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
భారత రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ( Ram Nath Kovind ) మూడేళ్ల పదవీకాలాన్ని శనివారంతో పూర్తి చేసుకున్నారు. రామ్‌నాథ్ కోవింద్ భారత 14వ రాష్ట్రపతిగా 2017 జూలై 25న పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ మూడేళ్ల కాలంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు.. ఎంతోమందితో భేటి అయిన రాష్ట్రపతిగా నిలిచారు.
TDP MPs: అమరావతి : టీడీపీ ఎంపీలు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతిని కలిసేందుకు టీడీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ లభించింది. గత 13 నెలలుగా ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎంపీలు రాష్ట్రపతికి నివేదించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
mercy plea of Nirbhaya convict Vinay Kumar Sharma నిర్భయ దోషుల ఉరితీతకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రతి రామ్ నాథ్ కోవింద్ శనివారం నిర్భయ దోషి వినయ్ వర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టివేశారు. దీంతో నలుగురు దోషులకు శిక్ష మరో రెండు వారాల్లో అమలు కానుంది.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. నిర్భయ కేసులో దోషులకు జనవరి 22న మరణశిక్ష అమలు చేయడం లేదు. తాజా డెత్ వారెంట్ ప్రకారం ఉరిశిక్ష అమలు ఫిబ్రవరి 1కి వాయిదా పడింది.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో దోషి ముకేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్ద తిరస్కరించారు. గురువారం (జనవరి 16) రాత్రి ముకేశ్ పిటిషన్‌ను రాష్ట్రపతి భవన్‌కు కేంద్ర హోం మంత్రిత్వశాఖ పంపించింది.
నిర్భయ కేసు దోషులలో ఒకరైన ముకేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్దకు చేరింది. గురువారం (జనవరి 16) రాత్రి ముకేశ్ పిటిషన్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపించినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది.
నిర్భయ కేసు దోషులకు విధించిన డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుచేయాలని ఆదేశిస్తూ ఢిల్లీ పాటియాలా హైకోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌లో ఎలాంటి తప్పిదం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
నిర్భయ అత్యాచారం, హత్య దోషుల మరణ శిక్ష అమలు విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పాటియాలా హౌస్ కోర్ట్ డెత్ వారెంట్ ప్రకారం దోషులు నలుగురిని జనవరి 22న కచ్చితంగా ఉరితీయడం కుదరదని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు తెలిపింది.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. శీతాకాల విడిది నిమిత్తం సతీ సమేతంగా హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, హోంమంత్రి మహమూద్ అలీ, శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర డీజీపి మహేందర్ రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి పుష్పగుచ్చాలతో ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.