రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర కేబినెట్

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర కేబినెట్

Last Updated : Jul 4, 2019, 11:40 AM IST
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర కేబినెట్

ఢిల్లీ: వరి కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.65 (3.7 శాతం) పెంచినట్టు ప్రకటించింది. ధర పెరిగిన అనంతరం క్వింటాల్ వరి మద్దతు ధర రూ.1,815కు చేరింది. బుధవారం పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అందులో వరితోపాటు నూనె గింజలు, పప్పుధాన్యాలు, ఇతర తృణధాన్యాలకు కనీస మద్దతు ధరల పెంపు నిర్ణయం కూడా ఒకటి కావడం విశేషం. 

ఉత్పత్తి వ్యయానికి కనీసం రూ.1.5 రెట్లు అధికంగా ఉండేలా మద్దతు ధరలను నిర్ణయించాలని గతేడాది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకే పలు ధాన్యాలు, నూనె గింజల కనీస మద్దతు ధరలు పెంచుతున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు.

Trending News