Twitter shows wrong map of India: ట్విటర్ ఎక్స్‌ట్రాలు.. జమ్మూకశ్మీర్, లడఖ్‌‌ని వేరే దేశాలుగా గుర్తింపు

Twitter website shows J&K, Ladakh as separate country: న్యూ ఢిల్లీ: ట్విటర్ మరోసారి మహా తప్పిదానికి పాల్పడింది. ఇప్పటికే భారత ప్రభుత్వం విధించిన ఐటి చట్టాలను (IT Rules in India) అనుసరించేందుకు ముందుకు రాని ట్విటర్ తాజాగా భారత చిత్రపటాన్ని తప్పుగా చూపించి మరో పెద్ద పొరపాటు చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 28, 2021, 05:09 PM IST
Twitter shows wrong map of India: ట్విటర్ ఎక్స్‌ట్రాలు.. జమ్మూకశ్మీర్, లడఖ్‌‌ని వేరే దేశాలుగా గుర్తింపు

Twitter website shows J&K, Ladakh as separate country: న్యూ ఢిల్లీ: ట్విటర్ మరోసారి మహా తప్పిదానికి పాల్పడింది. ఇప్పటికే భారత ప్రభుత్వం విధించిన ఐటి చట్టాలను (IT Rules in India) అనుసరించేందుకు ముందుకు రాని ట్విటర్ తాజాగా భారత చిత్రపటాన్ని తప్పుగా చూపించి మరో పెద్ద పొరపాటు చేసింది. ట్విటర్ అధికారిక వెబ్‌సైట్‌లో భారత చిత్రపటంలో ఉండాల్సిన జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాలను మరో దేశంగా చూపించింది. ట్వీప్ లైఫ్ పేరిట ఉన్న పేజీలో కెరీర్ సెక్షన్ అనే ట్యాబ్‌లో ఇండియా మ్యాప్‌ను ట్విటర్ తప్పుగా చూపించడం గమనించవచ్చు.

Also read : T20 World Cup venue shifted to UAE: దుబాయ్‌లోనే టీ20 వరల్డ్ కప్: సౌరవ్ గంగూలీ

ట్విటర్ ఇలా భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా చూపించడం ఇదేం తొలిసారి కాదు. గతంలో మన భారత భూభాగమైన లేహ్ (Leh) ప్రాంతాన్ని చైనా (China) భూభాగంగా చూపించింది. అప్పట్లో భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో తమ పొరపాటును సరిదిద్దుకున్న ట్విటర్ (Twitter showing wrong map of India) తాజాగా అటువంటి పొరపాటే మరోసారి చేయడం గమనార్హం.

Also read : Summons to Google and Facebook: గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలకు కేంద్రం సమన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News