Exit polls 2024: మోదీ హ్యట్రిక్ రికార్డు.. కుండ బద్దలు కొట్టి చెప్పిన మెజారీటీ సర్వే సంస్థలు..

Lok sabha exit polls Updates 2024: లోక్ సభ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. రెండు నెలల పాటు సార్వత్రిక ఎన్నికలు నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితమే అనేకు సంస్థలు ఎగ్జిట్ పోల్ ను విడుదల చేశాయి. 

Written by - Inamdar Paresh | Last Updated : Jun 1, 2024, 08:03 PM IST
  • బీజేపీకే పట్టం కట్టిన ప్రజలు..
  • మోదీ మూడో సారి ప్రధాని అంటున్న సర్వే సంస్థలు..
Exit polls 2024: మోదీ హ్యట్రిక్ రికార్డు.. కుండ బద్దలు కొట్టి చెప్పిన మెజారీటీ సర్వే సంస్థలు..

Lok Sabha exit poll results  2024: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఈరోజుతో ముగిశాయి. ఇదిలా ఉండగా కాసేపటి క్రితమే అనేక సర్వే సంస్థలు ఎగ్జిట్ పోలింగ్ ఫలితాలను విడుదల చేశాయి. ముఖ్యంగా.. రిపబ్లిక్ పీమార్క్, ఇండియా న్యూస్- డీ డైనమిక్స్, రిపబ్లిక్ భారత్- మ్యాట్రిజ్ లు చేసిన సర్వేల్లో బీజేపీ భారీగా సీట్లు గెలుచుకుంటుదని సంస్థలు ప్రకటించాయి. దేశంలో మోదీ హ్యాట్రిక్ గా ప్రధాని కావడం ఖాయమంటూ కూడా మెజారీటీ సర్వేసంస్థలు తెల్చి చెప్పాయి. దీన్ని బట్టి చూస్తే దేశంలో మోదీ మెనియా కొనసాగుతుంది.

ఎగ్జిట్ పోల్స్ అనేది ఎన్డీయే ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధించడం పక్కా అంటూ ఇప్పటికే సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఇక దేశంలో మోదీ మూడోసారి ప్రధాని కావడం పక్కా అంటూ అనేక సర్వే ఫలితాలు పేర్కొంటున్నాయి. దేశంలో మోదీని ఢీకొట్టగల పార్టీ లేదని ఈ సర్వేల ఫలితాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇక పూర్తి స్థాయిలో సమగ్ర ఫలితాల కోసం మాత్రం జూన్ 4 వరకు మాత్రం వేచీ చూడాల్సిందే. 

వివిధ సంస్థల ఎగ్జిట్ సర్వే ఫలితాలు..
 
రిపబ్లిక్ టీవీ చేసిన సర్వే..  

ఎన్డీయేకు 371 స్థానాలు, ఇండియా కూటమికి కేవలం 125 స్థానాలు, ఇతరులు 47 స్థానాల్లో గెలుస్తారని తెల్చి చెప్పింది.

రిపబ్లిక్ భారత్ - మ్యాట్రిజ్ సర్వే.. 

ఎన్డీయేకు 356 - 368 మధ్యలో సీట్లు వస్తాయని సంస్థ తెలిపింది.  ఇండియా కూటమి 118 నుంచి 133 స్థానాలు సీట్లు గెలుచుకుంటుందని సర్వే సంస్థ తెలిపింది.

జన్ కీ బాత్ సర్వే ..

ఈ సర్వేలో కూడా ఎన్డీయే కు 362 - 392 సీట్లు, ఇండియా  కూటమికి 142-161 సీట్లు, ఇతరులు- 10-20 సీట్లు గెలుస్తారని తెల్పింది.

న్యూస్ నేషన్ సర్వే ..

ఎన్డీయే ఈ ఎన్నికలలో 342-378 సీట్లు, ఇండియాకూటమి - 153-169, ఇతరులు 21-23 వరకు సీట్లు సాధిస్తారని సంస్థ తెలిపింది.

దైనిక్ భాస్కర్ ఎక్జిట్ పోల్స్..

ఈ సర్వేలో ఎన్డీయే 281-350 స్థానాలు, ఇండియా కూటమి 145-201,  ఇతరులు 33-49 స్థానాలు వస్తాయని సంస్థ తెలిపింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News