President Election Polling: భారత 15వ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పార్లమెంట్ తో పాటు అన్ని రాష్ట్రాలు, అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీలో ఉండగా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈనెల 21న కౌంటింగ్ నిర్వహిస్తారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో 776 ఎంపీలు ఉన్నారు. వారి ఓట్ల విలువ 5,43,200. ఇక 4033 ఎమ్మెల్యేలు ఉంటే.. వారి ఓట్ల విలువ 5,43,231గా ఉంది. ఈ ఓట్ల విలువలో ఎన్డీయేకి 49%, యూపీయేకి 24.02%, ఇతర పార్టీలకు 26.98% బలం ఉంది. గతంలో కంటే ఈ సారి ఎన్డీయే బలం కొంత ఎక్కువగానే ఉంది. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మినిట్ టు మినిట్ అప్ డేట్స్..